టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ 2 తాండవం సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య సినీ కెరీర్‌లోనే కాదు.. మరో పక్క పాలిటిక్స్ లోను, బుల్లితెరపై హోస్ట్గాను సత్తా చాటుతూ.. ప్రజల్లో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు. ఇక తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఐదుపదుల వయస్సులోను యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో అదరగొడుతూ.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న బాలయ్య.. ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. ఇక బాలయ్య వయసు పెరుగుతున్న కొద్ది.. తన సినిమాలతో మార్కెట్ ని కూడా అంతకందుకు పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం రోజుల్లో సినిమా 50 రోజులు ఆడిందంటేనే అదో పెద్ద సంచలనం. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అంచనాలకు వచ్చేస్తున్నారు. కానీ గతంలో.. ఎన్నో సినిమాలు 100 రోజులు 500 రోజులు ఆడి సంచలనాలు సృష్టించాయి.
అలాగే బాలయ్య కెరీర్‌లోను ఓ సినిమా ఏకంగా 1000 రోజులు నిరంతరాయంగా ఆడి.. రికార్డులను క్రియేట్ చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఒకసారి చూద్దాం. ఆ మూవీ మరేదో కాదు.. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ పాత్రలో మెరసాడు. జగపతిబాబు విలన్ పాత్రలో.. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా కనిపించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలనచిత్ర బ్యానర్లపై.. సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమా.. 2014 మార్చ్ 28న రిలీజైన ఈ మూవీబాలయ్య కెరీర్‌లోను ఏకంగా 1000 రోజులు నిరంతరాయంగా ఆడిన ఏకైక మూవీగా నిలిచింది.