బాలయ్య – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

ఇండస్ట్రీలో చాలా సంద‌ర్భాల‌లో కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. కానీ అలాంటి కాంబో వ‌స్తే బాగుంటుంద‌ని.. క‌చ్చితంగా చూడాలని చాలి మంది ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతుంటారు. చాలా కాలం ఆ కాంబినేష‌న్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి కాంబిషేన్స్ ఫిక్స్ అయినట్లే అయ్యి.. బివ‌రి నిమిషంలో క్యాన్సిల్ అయిన సంద‌ర్బాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అలాంటి ఓ క్రేజి కాంబోలో సాయి ప‌ల్ల‌వి – బాల‌య్య కాంబో కూడా ఒక‌టి.

varalaxmi-sarathkumar-nandamuri-balakrishna-96883022 - Telugu Lives -  Telugu Latest News

ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న బాలయ్య‌, సౌత్ లేడి పవర్ స్టార్‌గా క్రేజ్‌తో దూసుకుపోతున్న‌ సాయిపల్లవి కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీళ్ళ కోరికకు తగ్గట్టుగానే టాలీవుడ్లో డైరెక్టర్ అలాంటి సాహసం చేశారు. ఆల్మోస్ట్ కంబో ఫిక్స్ అయిపోయింది. అంతా ఓకే అనుకునే చివరి నిమిషంలో సాయి పల్లవి సినిమాను రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ సినిమా వేరే హీరోయిన్‌తో తెరకెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత‌కి ఆ మూవీ మరేదో కాదు.. బాలయ్య‌ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి.

Sai Pallavi - Wikipedia

మల్లినేని గోపీచంద్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఇక ఈ సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్.. బాలకృష్ణకు చెల్లెలు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాత్ర కోసం మొదటి సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట టీం. కొన్ని కారణాలతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. తర్వాత.. ఈ పాత్రలో వరలక్ష్మి స‌ర‌త్‌కుమార్ నటించి విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య చెల్లెలు పాత్రకు వరలక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది. అయితే బాలయ్య, సాయి పల్లవి కాంబోలో మాత్రం ఈ సినిమా మిస్ అవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్య‌క్తం చేశారు.