సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ అయి కొద్దిగా ఫేమ్ వస్తే చాలు.. ఆ నటినట్లకు ఇతర నటినట్టులతో ఎఫైర్లు అంటకట్టేస్తుంటారు. వారు ఎవరితో కలిసి ఫోటో దిగినా.. వెంటనే పెళ్లి వార్తలు కూడా వచ్చేస్తాయి. ఇలాంటివి ఇప్పుడు కాదు.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సెలబ్రిటీలుగా ఒకసారి ఎదిగిన తర్వాత.. వీటికి ఎంత దూరంగా ఉందామనుకున్నా కష్టమే. అయితే ఈ విషయంలో మాత్రం నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడట. తన 22 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. 26 ఎళ్ళకే ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజీ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
ఇక ఆరడుగుల ఎత్తు, మన్మధుడి రూపం.. ఏ వేషంలోనైనా ఒదిగిపోయినటించే తత్వం ఆయనకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే అలనాటి స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి.. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సావిత్రి, ఎన్టీఆర్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ తమిళ పేపర్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళిన వెంటనే.. వాటికి చెక్ పెట్టాడు. అది కూడా ఓ క్రేజీ సంఘటనతో వాళ్ల నోళ్లు మూయించాడు. పదేపదే ఇదే వార్తలు రిపీట్ కావడం.. అప్పటికి ఆయనకు పెళ్లయిపోవడంతో.. ఇది ఇబ్బందులుగా మారకూడదని ఆలోచించిన ఎన్టీఆర్.. అప్పటికప్పుడు తన దగ్గర డబ్బు లేకపోయినా.. ఓ అగ్ర నిర్మాత దగ్గర ఏకంగా లక్ష రూపాయలు అప్పు చేసి మరి చెన్నైలో ఓ ఇల్లు కట్టుకున్నారు.
వెంటనే తన భార్య బసవతారకమును తనతో పాటు తీసుకువెళ్లి అక్కడే కాపురం పెట్టేసారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆడంబరాలు, విందులకు చాలా దూరంగా ఉండే ఎన్టీఆర్.. ఈ కార్యక్రమాన్ని మాత్రం అంగరంగ వైభవంగా జరిపించాడు. గృహప్రవేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రస్.. ముఖ్యంగా తనపై వస్తున్న రూమర్లు ఏ పత్రిక నుంచి వస్తున్నాయో చూసి మరి కచ్చితంగా ఆ పత్రిక విలేకరులు కూడా అక్కడకు వచ్చేలా చూసుకున్నారు. వాళందరినీ ఆహ్వానించారు. ఈ ఫంక్షన్‌కు మహానటి సావిత్రిని కూడా ఆహ్వానం ఇచ్చి ఆయన ఎంత గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రి తాను ఎన్నో సినిమాల్లో కలిసి చేసాం. ఇక నాకు సావిత్రి ఓ తోబుట్టువు లాంటిది. ఈరోజు నా ఇంట్లో ఆడపడుచు స్థానంలో పాలు పొంగించింది కూడా ఆమె అంటూ చెప్పుకొచ్చారు. దెబ్బతో అప్పటినుంచి సావిత్రి, ఎన్టీఆర్ మధ్య రూమర్ వార్తలకు చేపడింది. గుమ్మడి స్వయంగా తన పుస్తకంలో ఈ విషయాలు రాసుకున్నారు.