సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చే అన్ని పరిణామాలను ఎదుర్కోవాలి.. అన్నింటికీ సిద్ధమై ఇండస్ట్రీలోకి అడుగుపెడితేనే సక్సెస్ సాధించగలుగుతారు. అయితే.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం మధ్యలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోలేక ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే హీరోయిన్ మాత్రం వాళ్ళకి చాలా భిన్నం. ఈ హీరోయిన్ కు అయితే ఏకంగా ఓ డైరెక్టర్ మద్యం తాగించి ఏడు సార్లు నగ్నంగా షూట్ చేశాడట. ఇంతకీ ఆ హీరోయిన్, డైరెక్టర్లు ఎవరూ అసలు హీరోయిన్ మద్యం మత్తులోనే చేసిందా.. లేదా సినిమా కోసం అన్నీ తెలిసే అలా కనిపించిందా ఒకసారి చూద్దాం.
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు నిన్నటి కుబ్రా సైట్. ఈమెకు తెలుగు ఆడియన్స్‌లో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ.. సీక్రెట్ గేమ్స్ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఈ సిరీస్ లో ట్రాన్స్ జెండర్ పాత్రలో కుబ్రా మెప్పించింది. ఇందులో ఆమె పేరు కుక్కు. 2018 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కుబ్రాకి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ కంటే ముందు పది సినిమాల్లో నటించినా రాని ఇమేజ్.. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఆమెకు దక్కింది. అయితే ఈ వెబ్ సిరీస్ టైంలో జరిగిన ఓ అనుభవాన్ని గురించి టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబ్రా క్లియర్‌గా వెల్లడించింది.
సీక్రెట్ గేమ్స్ వెబ్ సిరీస్ కోసం డైరెక్టర్ అనరాగ్ కస్యప్ ఓ సీన్ కోసం నాకు మందు తాగించి ఏకంగా ఏడుసార్లు ఆ సీను రూపొందించారని.. అయితే ఆ ఒక్క సీన్ కోసం నేను నవాజుద్దీన్ సిద్ధికి ముందు బట్టలు విప్పి నగ్నంగా చేయాల్సి వచ్చింది.. ఈ సీన్ చేసే ముందు డైరెక్టర్ నాకు ఒక పెగ్గ్ విస్కీ తాగమని ఇచ్చారు.. ఆ టైంలో నేను ఎందుకని అడిగా.. విస్కీ తాగితేనే డైలాగ్స్ ఎమోషన్ తో వస్తాయని చెప్పారు. అయితే ఆ సన్నివేశం కోసం నేను పెగ్గ్ తాగడానికి ఒప్పుకున్నా. విస్కీ తాగాకా బట్టలు విప్పి ఏ అమ్మాయి కూడా చేయని.. నటించని ఓ సీన్ చేశా. అయితే ఈ సీన్ అయిపోయాక.. డైరెక్టర్ సీన్ సరిగ్గా రాలేదు అని నన్ను ఒప్పించి దాదాపు ఇదే టేక్స్ 7సార్లు నాతో చేయించాడు.
అయితే ఈ సీన్ చేయడానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి.. అన్నీ నా ఇష్ట ప్రకారమే అయ్యాయి.. అంటూ కుబ్రా చెప్పుకొచ్చింది. అలాగే ఆ సీన్ చేసేటప్పుడు కూడా అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారని వివరించిన కుబ్రా.. అలా నేను విస్కీ తాగి మరి ఏడు టేక్స్ తీసుకొని నగ్న సన్నివేశాలు చేశాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ఈ సన్నివేశం ముగిసిన తర్వాత నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయని.. ఇప్పటివరకు నాలా ఎవరూ కూడా నటించి ఉండరు.. కానీ ఆ సీన్ అయిపోయాక చాలా గర్వంగా ఫీల్ అయ్యా.. అంటూ కుబ్రా ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం కుబ్రా చేసిన కామెంట్స్ నెట్ ఉంటే తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే జనం రకరకాలుగా స్పందిస్తున్నారు.