టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్ చేయడంలో ఆయన ఎంతో ఆశక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ నవమి సందర్భంగా.. సినిమా ఫస్ట్ స్టార్ట్ 11 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు టీం తాజాగా అప్డేట్ ఇచ్చారు.
ఫైనల్లీ రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తయిందని డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ పోషించే పాత్ర గురించి.. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో కథనాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట్లో ఇదో బయోపిక్ అనే టాక్ నడిచినా.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని బుచ్చిబాబు తెల్చేశారు. తర్వాత కొన్నాళ్లకు ఈ సినిమాలో చరణ్ కి చెవులు పనిచేయవు, మాటలు రావు అనే ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా చరణ్ రోల్‌కు సంబంధించిన మరొక షాకింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. ఈ మూవీలో చరణ్ ఓ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడని.. అంటే అత్యంత పొట్టివాడి పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తుంది.
ఇప్పటివరకు ఇలాంటి సాహసం కేవలం కమల్ హాసన్ మాత్రమే చేశారు. స్టార్ హీరోలెవరు ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోరు. కానీ ఇన్నాళ్ల తర్వాత రామ్ చరణ్ మరోసారి అలాంటి సాహసం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు గాని.. ప్రస్తుతం ఇదే న్యూస్ తెగ వైరల్ అవడంతో అసలు చరణ్ ఇలాంటి పాత్రలో నటిస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా.. ఆడియన్స్ చరణ్‌ను యాక్సెప్ట్ చేస్తారా.. లేదా.. అని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే అసలు వాస్తవం రేపు టీజర్ తో తేలిపోతుంది. ఒకవేళ ఈ రోల్‌లో చరణ్ నటిస్తే మాత్రం.. రేపు ఇదే సమయానికి సోషల్ మీడియాలో సంచలనం మామూలుగా ఉండదు.