ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచల అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకని మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. అయితే తన సినీ కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిరంజీవి రిజెక్ట్ చేసుకున్న ఆ బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలు ఏంటో.. వాటిని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం.
గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో అర్జున్ హీరోగా మన్యం మొనగాడు సినిమా రూపొంది మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను అర్జున్‌తో కాకుండా.. చిరుతో చేయాలని కోడి రామకృష్ణ అనుకున్నారట. కథను కూడా చిరంజీవికి వినిపించాడట. అయితే.. కథ విన్న చిరంజీవి.. స్టోరి చాలా బాగుంది.. ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ.. ఇది నాపై వర్కౌట్ కాదు అని సజెషన్ ఇచ్చారట. దీంతో మూవీ కథను కోడి రామకృష్ణ అర్జున్ కి వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇక నాగార్జున హీరోగా రాఘవేంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన ఆఖరిపోరాటం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాని మొదట రాఘవేంద్రరావు చిరంజీవితో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా.. చిరు కథను వినిపించగా.. సినిమాకు ఓకే చెప్పిన చిరంజీవి షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఇతర సినిమాల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాలో చేయలేనని టీం తో చెప్పేసాడట. దీంతో రాఘవేంద్రరావు కథని నాగార్జునకు వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు.