పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదట కృష్ణంరాజు నటవారసుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఆడియన్స్‌కు పరిచయమైన ప్రభాస్.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకున్నా.. తన నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాలో నటించిన ప్రభాస్.. వర్షం సినిమాతో మొట్టమొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదగడానికి ప్రధాన కారణం మాత్రం బాహుబలి సినిమా అనడంలో అతిశయోక్తి లేదు.
సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ నటన, కటౌట్, డైలాగ్ డెలివరీ.. అన్ని ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బాహుబలి సీక్వెల్‌గా బాహుబలి 2ను తెరకెక్కించారు. ఈ సినిమాల్లో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్న ఇలా ఎంతో మంది పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే మొదట ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసం హీరోగా ప్రభాస్ను కాకుండా.. జక్కన్న మరో వ్యక్తిని భావించాడట.
ప్రభాస్ స్థానంలో ఈ సినిమాకు సూర్యను అనుకున్నాడట. కానీ.. కారణం ఏంటో తెలియదు ఆఫర్ తప్పుకుని ప్రభాస్ కు వెళ్ళింది. ఇక జక్కన్న చెప్పిన స్టోరీ నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ వస్టర్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారి వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.