సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. ఈ స్థాయికి వచ్చానంటూ వెల్లడించిన మోహన్ బాబు.. ట్రోల్స్ చేసే వారిని అసలు నేను పట్టించుకోనుంటూ చెప్పుకొచ్చాడు. తను చూసిన మొదటి సినిమా రాజమకుటం అని.. ఎవరికి చెప్పకుండా ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మరి సినిమా చూశాను అని చెప్పుకొచ్చాడు. దాసరి నారాయణరావు నాకు సినిమాల్లో మొదటి అవకాశం ఇచ్చారని.. 1975లో స్వర్గం నరకం సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని.. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటూ వివరించాడు.
ప్రతిజ్ఞ సినిమాతో నేను ప్రొడ్యూసర్ గా నా బ్యానర్ ప్రారంభించా.. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఆ ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారు. అదే బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ హీరోగా.. నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి మేజర్ చంద్రకాంత్ సినిమాను తెరకెక్కించా అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కాగా.. అన్నగారు ఎంత వద్దని వారించినా.. మొండిగా ఈ సినిమా తీశా.. సక్సెస్ సాధించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాలిటిక్స్ నాకు సెట్ కావని చెప్పుకొచ్చిన మోహన్ బాబు.. దేవుడి ఆశీస్సులతో మంచి పాత్రలు వస్తే నటిస్తూ పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా ఫెయిల్యూర్ వేరు, నటుడుగా ఫెయిల్ అవ్వడం వేరు.. నేను నటించిన సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు నటుడిగా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు అంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశాడు.
దాదాపు 560 సినిమాల్లో నటించానని.. ఇప్పుడు నా పిల్లలు సినిమాల్లో చేస్తున్నారు.. నేను అరుదుగా కనిపిస్తున్న అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నేను ఇతరులకు అపకారం చేయలేదని.. నన్ను ఎంతోమంది మోసం చేశారు అప్పటినుంచి నాలో ఆవేశం వచ్చింది.. నా ఆవేశం నాకు నష్టాన్ని కలిగించింది అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక ట్రోల్స్ నేనెప్పుడూ పట్టించుకోనని.. పక్కన వారు నాశనం అవ్వాలని నేను కోరుకోను.. కోరుకుంటే ముందు మనమే నాశనం అవుతాం. ఒకరిని మార్చాలని ఎప్పుడు అనుకోకూడదు.. అందరూ క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకుంటా. ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్లకి ఏం ఆనందం వస్తుందో నాకు ఎప్పటికీ అర్థం కాదు అంటూ మోహన్ బాబు చెప్పకొచ్చాడు. ఈ విషయం పై నేనెప్పుడూ ఎవరిని నిందించను.. దేవుడి దయ వల్ల కన్నప్ప సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆయన ఆశీస్సులతో పూర్తయ్యింది అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక ప్రేక్షకులు నా దృష్టిలో ప్రత్యేక దేవుళ్ళని.. మోహన్ బాబు వివరించారు. ప్రస్తుతం మోహన్ బాబు కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.