ఆ హీరో కారణంగా టాలీవుడ్ సర్వనాశనం.. వేణు స్వామి మరో బిగ్ బాంబ్..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్తూ కాంట్రవర్సీల్లో చిక్కుకొని హైలెట్గా మారిన వేణు స్వామి.. తాజాగా మరోసారి బిగ్ బాంబ్ పేల్చాడు. గతంలో వేణు స్వామికి మహిళా కమిషన్ సీరియస్గా వార్నింగ్‌ ఇచ్చినా.. కాస్త కూడా ఆయన మైండ్ సెట్ మారడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో ఏదో ఒక సెలబ్రిటీ గురించి సంచల కామెంట్స్ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. రీసెంట్‌గా ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు.. పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి పరోక్షంగా సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి.

పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ముఖ్యంగా హీరో వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అవుతుంది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్లు అభిమానుల్లో కోపాన్ని తెస్తున్నాయి. మరి ఇంతకీ వేణు స్వామి చెప్పిన హీరో ఎవరు.. అసలు వేణు స్వామి ఆ హీరో గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి వేణు స్వామి ఎక్కువగా ప్రభాస్ ఆరోగ్యం, నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ నెగిటీవ్ జాతకాలు చెప్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ తో వార్నింగ్ కూడా వచ్చింది. ఇక ప్రభాస్ అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నాడని అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. తాజాగా.. ఆయన మాట్లాడిన ఆడియో కాల్ కూడా తెగ వైరల్ గా మారింది.

Allu Arjun Did Not Exit Theatre Despite Being Informed About Woman's Death:  Hyderabad Police

అంతే కాదు అదే ఆడియో కాల్లో సమంత, విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారని.. ప్రభాస్ కు ప్రాణగండం ఉందంటూ సంచలన కామెంట్లు చేయడం అందరికి షాక్‌ను కలిగించింది. ఇదిలా ఉంటే.. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ పై పాజిటివ్‌గా జాతకాన్ని చెప్పే వేణు స్వామి.. తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం ప్రారంభమైందని.. అది కూడా అల్లు అర్జున్ వల్లే తెలుగు ఇండస్ట్రీ పతనం అవ్వబోతుందంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ చేసిన పనికి తెలుగు ఇండస్ట్రీ ప‌రువు బుగ్గీపాలు అవుతుందని.. ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో దుమారం రేపుతున్నాయి.

The Rise and The Rise of Allu Arjun – Wow Hyderabad

అల్లు అర్జున్ మీద శని ప్రభావం ఉందని.. దీనివల్ల ఆయన జైలుకు వెళ్ళినా.. ఆ ప్రభావం కొంతమేర తగ్గినా.. ఇంకొంత మాత్రం అలాగే ఉందని.. సుకుమార్, అల్లు అర్జున్ ల మధ్య విభేదాలు తలెత్తి వారిద్దరి మధ్య దూరం ఏర్పడుతుందంటే చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి జాతకాల ప్రకారం త్వరలోనే వీళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. వేణు స్వామి మాట్లాడిన మాటలు అభిమానుల ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వేణు స్వామి పై మండిపడుతూ.. బండ బూతులు తిడుతున్నారు ఫ్యాన్స్.