ఫైనల్ గా రాజమౌళి నుంచి పాస్ పోర్ట్ లాక్కున్న మహేష్.. షూటింగ్ బ్రేక్ ఇచ్చి వెకేషన్ కి జంప్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసి.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి కావాల్సిన సెట్స్ హైదరాబాద్ లో రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న గ్యాప్ దొరకడంతో మహేష్ బాబు విదేశాలకు చెక్కేశారు. రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ బాబు పాస్‌పోర్ట్ లాగేసుకున్న అన్ని ఒక్క క్రేజీ పోస్ట్ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పూర్తయ్య వరకు మహేష్ ఏవికేషన్ కు వెళ్లలేడని రాజమౌళి ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడ‌ని అంత భావించారు.

Mahesh Babu and Rajamouli Delivering A Meme Fest | Mahesh Babu and Rajamouli Delivering A Meme Fest

ఫ్యాన్స్ కూడా దీనిని తెగ వైరల్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే హీరోలు ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. కానీ.. మహేష్ సినిమాకి ఆ రూల్స్ అన్ని మారిపోయాయి. మహేష్ బాబు తనకు నచ్చినట్లుగా యాడ్ చేస్తున్నారు. బయట అంత తిరిగేస్తున్నాడు. లొకేషన్స్ ని కూడా ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు కొద్ది గంటల క్రితం ఎయిర్పోర్ట్‌లో మెరిశాడు. అక్కడ ఉండే కెమెరామెన్స్‌ ఫోటోలు తిస్తుంటే మహేష్ తన పాస్‌పోర్ట్ ను చూపించి వాళ్లకు స్టిల్ ఇచ్చాడు.

SSMB29: Mahesh Babu playfully shows his passport as he travels with family

దీంతో రాజమౌళి దగ్గరనుంచి మహేష్ బాబు పాస్పోర్ట్ లగేసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడని సమాచారం. మహేష్ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు ఈ లొకేషన్ పూర్తి చేసుకుని మహేష్ రిటర్న్ కారున్నాడట. అయితే ఏ హీరోకి సాజన్ కానీ బెనిఫిట్స్ రాజమౌళి దగ్గర మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమవుతుండడం.. చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ పాస్పోర్ట్ చూపించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.