తాజాగా ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన మూవీ టెస్ట్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. శశికాంత్ దర్శకుడిగా వ్యవహరించారు. కొద్దిసేపటి క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ నడుస్తున్న క్రమంలో.. క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. ఇంతకీ మ్యాచ్ స్టోరీ ఏంటి.. విన్నర్ గా ఎవరు నిలిచారు.. రివ్యూ లో చూద్దాం.
కథ:
అర్జున్ సిద్ధర్ధ్.. ఓ స్టార్ క్రికెటర్. కుటుంబం కన్నా క్రికెట్ అంటేనే ఎక్కువగా ఇష్టపడే అర్జున్.. కొంతకాలం ఫామ్ లో లేకుండా పోతాడు. తర్వాత చెన్నై వేదికగా పాకిస్తాన్తో జరిగే ఓ కీలక టెస్ట్ మ్యాచ్లో చోటు దక్కించుకుంటాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతుంటాడు. సైంటిస్ట్ శరవణన్(ఆర్. మాదవన్)..పెట్రోల్ లేకుండా నీటితో నడిపే హైడ్రో ఫ్యూయల్ ఇంజన్ తయారుచేసి.. ప్రభుత్వ అనుమతి కోసం ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న క్రమంలో.. రూ.50 లక్షలు ఇస్తేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తామంటూ అధికారులు చెప్పేస్తారు. శరవణన్ భార్య కుముదా (నయనతార) టీచర్‌గా చేస్తూ ఉంటుంది. 34 ఏళ్ళు వచ్చిన పిల్లలు పుట్టకపోవడంతో ivf ద్వారా పిల్లలను కనాలని ఆరాటపడుతూ ఉంటుంది. దానికి రూ.5 లక్షలు కావాలి. మరి.. ఈ ముగ్గురి లైఫ్ లో చెన్నై టెస్ట్ మ్యాచ్ ఎలాంటి ట్విస్టులు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న పరీక్షలు ఏంటి..? ఎవరు సక్సెస్ అందుకున్నారు.. ఎవరు ఎలాంటి రిజల్ట్ అందుకున్నారు.. అనేదే స్టోరీ.
రివ్యూ:
సాధారణంగా ఇండియన్ క్రికెట్ మ్యాచ్ లో ధోని, రోహిత్, శర్మ విరాట్ కోహ్లీ జట్టులో ఉండి పాకిస్తాన్ తో ఆడుతున్నారంటే.. కచ్చితంగా మ్యాచ్ గెలిచేసామన్న భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. అచ్చం అలాగే ఇప్పుడు డైరెక్టర్ ఎస్. శశికాంత్ తన టెస్ట్ జట్టు లోకి మాధవన్, సిద్ధార్థ్, నయనతారాలను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమా పై ముందు నుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలనుకున్నాయి. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో టెస్ట్ గ్రేస్ పడగానే ఇద్దరు క్రికెటర్లు రంగంలోకి దిగుతారు. కానీ.. ఈ టెస్ట్ మూవీలో మాత్రం టైటిల్ పడగానే కెప్టెన్ శశికాంత్ అసలు ఆలస్యం చేయకుండా.. అర్జున్, శరవణన్, కుముదా మూడు పాత్రలను రంగంలోకి దింపేశాడు.
పాత్రల ఇంపార్టెన్స్ ఏంటి.. లైఫ్ లో వీళ లక్ష్యం ఏంటి.. అనేది క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ఈ పాత్రలను మరింత డెప్త్‌గా చూపించాలన్న ఉద్దేశంతో కాస్త సన్నివేశాలను సాగదీసినట్లు అనిపించింది. మ్యాచ్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే నిజమైన టెస్ట్ ఆడుతున్నారా.. లేదా.. ప్రాక్టీస్ చేస్తున్నారా.. అన్న ఫీల్ ఆడియన్స్ లో కలుగుతుంది. ముఖ్యంగా మాధవన్, నయనతార మధ్య సీన్స్ చాలా సాగదీతగా అనిపించాయి. ఇక పాకిస్తాన్ మ్యాచ్లో అర్జున్ ద్వారా బెట్ చేయించాలని ఓ సిండికేట్ ముఠా ప్రయత్నాలు చేస్తుంటారు ఈ క్రమంలోనే మ్యాచ్ ప్రారంభమైంది ఓవైపు బెట్టింగ్ వేయించాలని ప్రయత్నాలు.. మరోవైపు కుముద, శరవణన్ ఫ్యామిలీ డ్రామా సీన్స్ తో మెల్లమెల్లగా కథలో వేగం పెరిగింది.
కుముదతో కలిసి ఇంటికి వచ్చిన అర్జున్ కొడుకుని.. శర్వానంద్ కిడ్నాప్ చేయడం సినిమాలో అసలు మలుపు. ఇక్కడ నుంచి పాత్రలతో అసలైన సవాళ్లు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి డైరెక్టర్ మెయిన్ క్యారెక్టర్లకు పెద్ద పరీక్ష ప్రారంభమైంది. అప్పటివరకు పాజిటివ్గా వెళ్లిన శరవణన్ పాత్ర ఒక్కసారిగా నెగటివ్ షేడ్స్‌లో లోకి మారడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మాధవన్ ఈ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిరవరి 30 నిమిషాలలో మాధవన్ నటన ఫిక్స్ లెవెల్ లో ఉంది. ఆడియన్స్ సీట్ ఎడ్జ్‌కు వచ్చేసేలా ఆ సీన్స్ డిజైన్ చేశారు. ఈ సందర్భంగా అతను చెప్పే ఫిలాసఫీ.. కుమ్ముదతో వచ్చేసి సీన్స్ చూస్తే డబ్బు అవసరాలు మనిషిని ఎంతకు దిగజారుస్తాయో కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ చూపించాడు. మరోవైపు క్రికెట్ ఆ.. పర్సనల్ లైఫ్ ఆ.. అన్న ప్రశ్న ఎదురైతే అర్జున్ పాత్ర తీసుకునే నిర్ణయం ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
సిద్ధార్థ, నాయనతార, మాధవన్ ముగ్గురు ఈ టెస్ట్ లో తమ నటనతో ఆడియన్స్ను కట్టిపడేశారు. వాళ్ళు లేకపోతే కథలో అసలు బలమే ఉండదు అనడంలో సందేహం లేదు. ప్రజలకు మేలు చేయాలని తపనతో ఎంతో కష్టపడి జీవితంలో విసిగి.. వేపారి పోయినా ఒక సైంటిస్ట్ శరవణన్‌గా మాధవన్ నటనతో మెప్పించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ సినిమాకు మాన్ అఫ్ ద మ్యాచ్ మాధవన్ అనడంలో సందేహం లేదు. కుముద పాత్ర నయనతార కు చాలా కష్టతరం.. అయినా కూడా తను నటనతో మెప్పించింది. సిద్ధార్థ, మీరాజాస్మిన్ పాత్రలు చాలా సెట్టిల్డ్ గా అనిపించాయి. ఇద్దరు తమ పాత్ర నడివిమేర ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో రాసిన డైలాగ్స్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే కథలో ఏమాత్రం కొత్తదనం లేకున్నా శశికాంత్ ఎంచుకున్న నటీనటుల వల్ల సినిమాపై ఆసక్తి నెలకొంది. పైగా దాదాపు రెండున్నర గంటలకు కూడా సినిమాకు ఎక్కువ అన్న ఫీల్ వస్తుంది.
ఫైనల్ గా: బౌండరీస్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా.