సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్లయినా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నా.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా కొన్ని క్యాజువల్ ఇష్టాలు, అలవాట్లు ఉంటాయి. అయితే స్టార్స్ గా లైఫ్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ అలవాటుల్లో మార్పులు కచ్చితంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం చాలా వరకు తమకు నచ్చిన అలవాట్లను ఎప్పటికి మార్చుకోరు. అలాంటి ఓ గమ్మత్తైన అలవాటు తనకు కూడా ఉందని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
2000 సంవత్సరంలో రెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన క్యూట్ లుక్, యాక్టింగ్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. వరుస సినిమా ఆఫర్లు కొట్టింది. అలా.. తన కెరీర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న కరీనా.. ఒకానొక దశలో ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గాను రాణించింది. ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైంలో.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడి.. అతనితో డేటింగ్ తర్వాత అక్టోబర్ 16, 2012లో వివాహం చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక పెళ్లి తర్వాత పిల్లలు కుటుంబ బాధ్యతలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కరీనా.. ఇప్పటికీ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో ఉన్నారు. తనకున్న క్రేజ్ రిత్య వివాహం జరిగిన క్రమంలో కథా బలం ఉన్న క్యారెక్టర్ లో మాత్రమే నటిస్తూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలీవల ఏ ప్రాజెక్టులను అనౌన్స్ చేయలేదు కరీనా. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకు కిచిడి అంటే చాలా ఇష్టమని.. అది లేకుండా అసలు ఉండలేను అంటూ వెల్లడించింది. కనీసం వారానికి ఐదు సార్లు అయినా కిచిడిని తింటా.. తినకుండా మాత్రం అసలు ఉండలేను. అది లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కరీనా గమ్మత్తైన అలవాటు విని షాక్ అవుతున్నారు నెటిజన్స్. మరీ కిచిడి అంటే ఇంత పిచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు.