టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం పబ్లిక్ స్టేజ్ పై నిలబడతారని అంతా భావించారు. కానీ సెక్యూరిటీ కారణాలతో ఆ ఈవెంట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌తో లోటు తీర్చేశాడు తారక్. కేవలం స్టేజ్ పై కనిపించడం కాదు.. వరుసగా ఒకేసారి బోలెడన్ని గుడ్ న్యూస్ లు వినిపించాడు. వాటిలో మొదటి తారక్ చెప్పిన గుడ్ న్యూస్ దేవర 2కు సంబంధించిన అప్డేట్. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ దేవర. భారీ అంచనాలతో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దేవర.. పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత.. పలు ట్రోల్స్ ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే దేవర 2 ఆగిపోయింది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే.. తారక్ తాజాగా దీనిపై రియాక్ట్ అయ్యారు. దేవర 2 మాత్రం కచ్చితంగా ఉంటుందని.. మధ్యలో ప్రశాంత్ నీల్ రావడం వల్ల కాస్త బ్రేక్ పడిందంటూ.. నీల్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే.. దేవర 2 వచ్చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్టు గురించి నేరుగా ప్రస్తావించిన తారక్.. భవిష్యత్తులో ఈ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. మీరంతా కాలర్ ఎగరేసుకునేలా నా సినిమాలో ఫ్యూచర్లో ఉండబోతున్నాయంటూ హామీ ఇచ్చాడు. ఇక నార్ని నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్‌ల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
బామ్మర్ది గురించి మాట్లాడుతూ.. నితిన్ పరిశ్రమకు వస్తానని చెప్పినప్పుడు నా సపోర్ట్ ఉండదు.. నీ కష్టం నువ్వే పడు అంటూ చెప్పేశానని.. పైకు అలా చెప్పేసిన లోపల ఏం చేస్తాడు అని చాలా టెన్షన్ గా ఉండేది.. కానీ ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత తన ఫ్రీడమ్ తానే తీసుకున్నాడని.. ఒక్కరోజు కూడా ఈ సెట్స్ లో ఉన్నాను.. ఈ సీన్ ఈరోజు చేస్తున్నా అని నాతో అనలేదని.. ఇక సినిమాలో చాలా బాగా నటించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక సంగీత్ శోభన్ చాలా బాగా నటించారని.. ఆయన తండ్రి పేరు ప్రస్తావిస్తూ మీ తండ్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఆయన బ్లెస్సింగ్స్ నీతో ఉన్నాయని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రామ్ నితిన్ గురించి మాట్లాడుతూ.. నేను కెరీర్ స్టార్టింగ్‌లో తనలాగే ఉన్నా. తనలాగే కామెడీ పండించేదాన్ని. కానీ.. ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నా. అందుకే అదుర్స్ 2 సినిమా చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పై ప్రశంసలు కురిపిస్తూ.. అందరిని ఫుల్ ఖుషి చేసేసాడు. అభిమానులు వీలలు, కేకలు మధ్యన ఎంతో సంతోషంగా మెరిశాడు. ఈ ఏడాది వార్ 2 సినిమాతో పలకరించబోతున్న తారక్.. కేవలం 6 నుంచి 7 నెలల గ్యాప్ లోనే పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా.. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఓపెన్ స్టేజిపై కనిపించడం.. వరుస సినిమాల అప్డేట్లే ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.