ప్రభాస్ ఏకంగా ఇంత మందితో ఎఫైర్లు నడిపాడా.. ఆ లిస్ట్ ఇదే..!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్‌గా ప్రభాస్ తిరుగులేని క్రేజ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రభాస్ తో సినిమాల్లో నటించాలని.. ఆయనతో సినిమాలు తీయాలని దర్శక, నిర్మాతలతో సహా.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. అంతే కాదు.. ప్రభాస్‌కు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.

ఈ రెండు స్టార్స్ వల్లనే త్రిష మరియు అనుష్కలను ప్రభాస్ కి దూరమయ్యేలా..

ఈ క్రమంలోనే సినిమాల పరంగా జట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న ప్రభాస్. పెళ్లి విషయంలో మాత్రం నోరు మెద‌ప‌క‌పోవడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కల్పిస్తుంది. ఇప్పటికే.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చాలా మంది తెలుగు టాప్ సెలబ్రిటీస్ అందరి విష్ కూడా అదే. అయినా ప్రభాస్ పెళ్లి విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా.. ప్రభాస్ గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్‌తో ఎఫైర్‌లు న‌డిపిన‌ట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ప్రభాస్ ఎఫైర్ నడిపిన స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దాం.

 

గతంలో ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ త్రిష తో వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ టైంలో త్రిష తో లవ్ ఎఫైర్ మైంటైన్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. నిశ్చితార్థం, పెళ్లి అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి కానీ.. జరగలేదు. ఇంకా త్రిష తర్వాత ప్రభాస్.. అనుష్క‌ను ప్రేమించాడని.. ఇద్దరు ఒకరినొకరు పీకల్లోతుగా ప్రేమించుకున్నారని.. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎకబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ప్రభాస్ అభిమానులు మరో మెట్టు ముందుకేసి మరీ.. ప్రభాస్, అనుష్కకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నట్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసి తెగ వైరల్ చేశారు.

Kriti Sanon: Prabhas's denial, Kriti Sanon's cryptic post & engagement  rumours: What's cooking between 'Adipurush' co-stars? - The Economic Times

ఇక ప్రభాస్తో ఎఫైర్ నడిపిన మరో హీరోయిన్ కృతి సనన్‌. బాలీవుడ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా దూసుకుపోతున్న కృతి.. ప్రభాస్‌తో ఆది పూరుష్‌లో న‌టించి ఆకట్టుకుంది. ఈ సినిమా షూట్ టైంలో, ప్రమోషన్స్ టైం లో.. వీళ్ళిద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపించడంతో.. ఈ జంట ప్రేమించుకున్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత ఇదంతా ఫేక్ అని ప్రభాస్ కొట్టి పడేశారు. అలా.. ఒకానొకు టైంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్‌ను హోస్ట్ డైరెక్ట్‌గా ఈ ప్రశ్నలు అందించాడు. ఇక ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.