టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ వార్2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో.. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూట్ పూర్తయిన వెంటనే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్.. తన బామ్మర్ది నార్నీ నితిన్ ఓ ప్రధాన పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్‌లో సందడి చేశాడు.
ఇందులో భాగంగా ఆయన మ్యాడ్స్ స్క్వేర్ టీంను ప్రశంసించారు. తర్వాత ఆయన సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌ను షేర్ చేసుకున్నాడు. తారక్ మాట్లాడుతూ దేవర సినిమాను మీ భుజాలపై మోసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. దేవర 2 ఆగిపోయిందని ఇటీవల కాలంలో వార్తలు వింటున్నా. దేవర 2 ఆగిపోలేదు. కాస్త బ్రేక్ ఇచ్చామంతే.. ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు. నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే దేవర 2 వచ్చేస్తుంది అంటూ వివరించాడు.
మరోపక్క సితార ఎంటర్టైన్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా కూడా వస్తుంది అన్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో నటించి.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అదుర్స్ సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ఓ యాక్టర్‌గా సక్సెస్‌ఫుల్గా కామెడీ పండించడం చాలా కష్టమని.. అందుకు భయపడే అదుర్స్ 2 నేను చేయడం లేదంటూ చెప్పుకొచ్చాడు. సక్సెస్ మీట్‌లో చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ అభిమానులను పలకరించడంతో.. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తారక్ తన సినిమాలపై ఇచ్చిన వరుస అప్డేట్స్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు.