టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి డెన్ నుంచి తాజాగా రిలీజ్ అయిన మూవీ శారీ. అతను శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. ఆర్జీవి రచన సహకారంతోపాటు.. నిర్మాణంలోనూ పార్ట్నర్ షిప్ వహించాడు. ఆర్జీవి, ఆర్వి ప్రొడక్షన్ ఎల్ఎల్బీ బ్యానర్లపై ప్రముఖ బిజినెస్ మాన్ రవిశంకర్ వర్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా చేశారు. తాజాగా( ఏప్రిల్ 4 న) రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.
స్టోరీ :
ఆరాధ్య దేవి (ఆరాధ్య దేవి)కి మొదటి నుంచి చీరలు అంటే ప్రాణం. కాలేజీకి కూడా చేరలోనే వెళ్తుండేది. ఇన్‌స్టా రీల్స్ చీరలో చేసి షేర్ చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఒకసారి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిన ఆరాధ్యను చీరలో చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యదూ) ఆమెతో ప్రేమలో పడతాడు. దొంగ చాటుగా ఆమెను ఫోటోలు తీయడమే కాదు.. ఇన్స్టాల్ ఆమెతో చాట్ చేసి తనను ఫోటోషూట్‌కు ఒప్పించాడు. అలా.. మెల్లమెల్లగా ఆరాధ్యకు దగ్గరైన కిట్టు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లాగే చూస్తుంది.
ఇక ఫోటోషూట్ టైంలో ఆరాధ్య అన్నయ్య రాజు 9సాహిల్ సమ్భూల్య) కిట్టు తో గొడవ గొడవపడతాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా కిట్టును ఆరాధ్య దూరం పెడుతుంది. కిట్టు మాత్రం సైకోగా మారి ఆమెను వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని.. వెంటపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడతారు. తర్వాత స్టోరీ ఏంటి? సైకో కిట్టు ఆరాధ్య ని దక్కించుకోవడానికి ఏం చేశాడు.. చివరికి అతను అనుకున్నది సాధించాడా.. లేదా.. అనేది సినిమాలో చూడాల్సిందే.
రివ్యూ:
ఆర్జీవి పంథ అందరికి తెలిసిందే. నాకు నచ్చినట్లు సినిమా తీస్తా.. ఇష్టముంటే చూడండి.. లేదంటే వదిలేయండి అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఆర్జీవి సినిమాలు ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు సినిమాలు బోరింగ్ , తలనొప్పిగా అనిపిస్తున్న. అదిక వైలెన్స్, ఓవర్ గ్లామర్ తప్ప కథ, కంటెంట్ పెద్దగా ఉండడం లేదు. ఇలాంటి క్రమంలో ఆర్జీవి నుంచి వచ్చిన తాజా సినిమా శారీ అయిన ఆడియన్స్‌ను మెప్పించిందా.. అంటే లేదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. అంతే కాదు మొదటిసారి ఆర్జీవి తన సినిమాల్లో ఒక మంచి సోషల్ మెసేజ్ ను అందించాడు.
సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దుష్ప్రభావాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలని సందేశాన్ని సినిమాతో అందించాడు. ఇక డైరెక్టర్ మాత్రం తన దృష్టిని సోషల్ మెసేజ్ పై కాకుండా.. చీరలో ఆరాధ్య అందాలపై ఫోకస్ చేశాడు. ఆర్జీవి కథ సినిమాల మాదిరి ఈ సినిమాలోని హీరోయిన్ అందాల ప్రదర్శన పైన ఎక్కువ ఫోకస్ ఉంది. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా అనేలా సినిమాను రూపొందించాడు.
కానీ.. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక టైంలో ఆరాధ్యను చూస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. సత్య యదు పాత్ర చాలా బోరింగ్. ప్రతిసారి ఫోటో తీయడం, చీరలో ఆరాద్యను ఊహించుకోవడం.. ఒక పాట వేసుకోవడం.. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే కొనసాగింది. సెకండ్ హాఫ్ మొదట్లో కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించినా మళ్లీ బోరింగ్ సెక్షన్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే సత్య యదు చేసిన కొన్ని పనులు సైకోలా అనిపిస్తాయి. ఇక ఆరాధ్య కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్యాయదుల మధ్య వచ్చే సీన్స్ ఫుల్ బోరింగ్. కథంతా అక్కడక్కడ తిరిగినట్లు ఉంది. ముగింపు రొటీన్. వైలెన్స్ మాత్రం మితిమీరిపోయి.. సైకోగా సత్య యదు ఆడియన్స్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతకుమించి పెద్దగా ఆకట్టుకునే కంటెంట్ ఏమీ లేనేలేదు.
నటీనటుల పర్ఫామెన్స్:
సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ఆరాధ్య చీరలో అందాలు వలకపోస్తూ అదరగొట్టింది. ఆర్జీవి మెచ్చిన నటి కనుక తన స్టైల్ లోనే కావాల్సినట్లుగా తెరపై ఆమెను చూపించి కనువిందు చేశాడు. యాక్టింగ్ పరంగాను మెప్పించింది. ఇక సైకో కిట్టుగా.. సత్యా యదు మెప్పించాడు. ఒకానొక దశలో అతని నటనకు చూసే ఆడియన్స్ లో భయం పుడుతుంది. మిగతా సెలబ్రిటీస్ అంతా తమ పాత్రను నడివికి, ప్రాధాన్యతకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.
టెక్నికల్ గా:
ఇక సాంకేతికంగా సినిమా పర్లేదు అనిపించింది. శశి ప్రీతం రీ రికార్డింగ్ కొన్నిచోట్ల అతి అనిపించింది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించారు. కానీ.. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేయాల్సింది అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరింత బోరింగ్ అనిపించాయి. ఇక మొదటి నుంచి ఆర్జీవి సినిమాలంటే పెద్దగా బడ్జెట్ ఉండదు. ఒక ఇల్లు, రెండు మూడు పాత్రలు.. చాలా తక్కువ కాస్ట్యూమ్ లతో సరిపెట్టేస్తాడు. ఈ సినిమా కూడా అదే పంథాలో కొనసాగింది. ఖర్చు పెద్దగా చేయకపోయినా.. సినిమా ఉన్నంతలో రిచ్ గా రూపొందించారు.
ఫైనల్‌గా: ఆరాధ్య అందాలతో.. సైకో కిట్టు అరాచకం