వామ్మో ఆ బ‌యోపిక్‌లో ఛాన్స్ కొట్టేసిన శివానీ.. ఇక చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత‌..!

టాలీవుడ్ సినీ స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివానికి ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట కల్కి సత్యమేవ జయతే ఎలాంటి సినిమాలకు నిర్మాతక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చీ త‌ర్వాత టూ స్టేట్స్ సినిమాతో హీరోయిన్గా మారింది. కాగా ప‌లు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తాజాగా ఓ జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందంటూ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారుతుంది. స్టార్ హీరో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ఫేమస్ సైంటిస్ట్, ఇంజనీర్ గోపాల స్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం శివాని రాజశేఖర్‌ను సెలెక్ట్ చేసుకున్నారట టీం.

R Madhavan to play inventor GD Naidu in his next film | Zee Business

ఈ క్రమంలోనే జూన్ నుంచి శివాని రాజశేఖర్ ఈ సినిమా సెట్స్‌లో పాల్గొన్న నుందని.. మాధవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంద‌ని తెలుస్తోంది. శివాని గత సినిమాలను చూసిన దర్శక నిర్మాతలు.. ఈ పాత్రకు శివాని అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేసుకున్నారట. ఇక ఈ బయోపిక్‌లో శివాని రోల్ ఎప్పటికీ గుర్తుండి పోతుందని.. ఆమె కెరీర్‌లోనే సినిమా మైల్డ్ స్టోన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక.. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటించే ఆకట్టుకున్న ఈ అమ్మడు.. జీడి నాయుడు బయోపిక్ లో మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సినిమాకు కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

Shivani Rajasekhar Roped In For Intriguing Biopic! - TeluguBulletin.com

ఇక గోపాలస్వామి దొరైస్వామి.. కోయంబత్తూర్‌లోని రైతు ఫ్యామిలీలోని వ్యక్తి. పెద్దగా చదువుకోకపోయినా.. ప్రయోగాలపై ఉన్న ఆసక్తితో ఎన్నో రంగాల్లో సత్తా చాటుకుని గొప్ప ఆవిష్కరణలతో చరిత్రలో నిలిచిపోయాడు. ఇండియాలో ఎలక్ట్రిక్ మోటార్ ను కనిపెట్టింది ఈయ‌నే కావడం విశేషం. హోటల్ సర్వర్ గా కెరీర్ ప్రారంభించి.. ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో సంచలనం సృష్టించాడు. సొంతంగా ప్రయోగాలు చేసి.. ఎన్నో ఆవిష్కరణలు చేసి.. మీరాకిల్ మాన్, ఎడిషన్ ఆఫ్ ఇండియా, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్ అనే బిరుదులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన బయోపిక్ను రూపొందిస్తుండగా.. అందులో మాధవన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆల్రెడీ గతంలో రాకెట్రి ది నంబి ఎఫెక్ట్ సినిమా ద్వారా నంబి నారాయణ జీవితాన్ని తెర‌కెక్కించి.. ఈ సినిమాలో నటించి నేషనల్ అవార్డు దక్కించుకున్న మాధవన్.. ఇప్పుడు జీడి నాయుడు బయోపిక్ లో నటిస్తుండడం విశేషం.