ప్రస్తుతం సోషల్ మీడియా యుగం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటీనటులు, హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న.. ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ కి సంబంధించిన న్యూస్ నెట్ట వైరల్ గా మారుతుంది.
ఆమె మరి ఎవరో కాదు సుస్మితసేన్. గతంలో మిస్ యూనివర్స్ టైటిల్ ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా కంటే ఎఫైర్ వార్తలు తోనే భారీ పాపులారిటి దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో లలిత మోడీ, సంజయ్, రణదీప్, ఇంతియాజ్, వసీం ఇలా ఏకంగా 11 మందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. ఈమె వీళ్లలో ఒకరిని కూడా వివాహం చేసుకోలేదు సరి కదా.. పెళ్లి కాకుండానే ఏకంగా ఇద్దరు కూతుళ్లకు తల్లిగా మారింది.
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కుమార్తె పరిస్థితి బాగోకపోవడంతో అప్పట్లో సినిమా షూట్ మాని హాస్పిటల్‌కు తీసుకువెళ్లానని.. అపట్లో.. నాకు 24 సంవత్సరాలు ఆ వయసులోనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు కెరీర్ సీరియస్గా తీసుకోవడం లేదంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారని.. ట్రోల్స్ చేశారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుస్మిత సేన్‌కు సంబంధించిన ఈ న్యూస్ మరోసారి వైరల్‌గా మారుతుంది.