సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్‌లో మల్టీస్టారర్ హవా మొదలైంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలతో సహా.. హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
అయితే మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే చాలామంది స్టార్ హీరోస్ మల్టీ స్టారర్ సినిమాలో నటించే ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. అయితే మెల్లమెల్లగా ఈ ట్రెండ్ ఆగిపోయింది. అలా గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తర్కెక్కించాలని ప్లాన్ చేశాడట డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇద్దరు స్టార్ హీరోలుగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. వారి ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను డిజైన్ చేశాడట. కానీ.. అలాంటి కథతో ఇద్దరు హీరోలను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు పూరి జగన్నాథ్.
ఈ క్రమంలోనే ఇద్దరు కాంబోలో రావాల్సిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆదిలోనే ఆగిపోయింది. నిజానికి మహేష్ బాబును స్టార్ హీరోగా చేసిన డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ పేరు వినిపిస్తుంది. పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలతో మహేష్ బాబుకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల తర్వాత మహేష్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఇక బాలకృష్ణకు సైతం పూరీ జగన్నాథ్.. పైసా వసూల్ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలని పూరీ జగన్నాథ్ భావించాడట. అయితే పూరి కథ విషయంలో తడబడడంతో.. సినిమా ఆగిపోయిందట. ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు కానీ.. నిజంగా వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే మాత్రం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించేది అనడంలో అతిశయోక్తి లేదు.