ప్ర‌భాస్ సినిమాకు అడ్డ‌ప‌డ్డ తార‌క్‌… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డిన నిజం..!

ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబ‌ల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వ‌రుస‌ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న ఇద్దరు హీరోలకు సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. గతంలో ప్రభాస్ నటించాల్సిన‌ ఓ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ అడ్డుపడ్డాడంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఎన్టీఆర్ అడ్డుపడడానికి గల కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

Varsham (2004 film) - Wikipedia

దాదాపు రెండున్నర ద‌శాబంధాల‌ క్రితం.. అంటే ఎన్టీఆర్, ప్రభాస్ అప్పుడప్పుడు కెరీర్‌లో నిల‌దొక్కుకుంటున్న టైంలో.. ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు తీసేందుకు ఎంతో మంది ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. ఎన్టీఆర్ – సింహాద్రి, ప్రభాస్ – వర్షం సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్న ఆవుల గిరి.. ప్రభాస్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ సమక్షంలోనే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చేసి సినిమాను కన్ఫర్మ్ చేయించుకోవాలని ఫిక్స్ వెళ్ళాడ‌ట.

Producer reveals how movies with Pawan Kalyan, Nagarjuna fell apart -  Telugu News - IndiaGlitz.com

అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఆవుల గిరికు ప్రభాస్ తండ్రీ ఈరోజు మంచి రోజు కాదు.. అడ్వాన్స్ మూడు రోజుల తర్వాత తీసుకుంటానని చెప్పి పంపించేసారట. ఇక ఈ గ్యాప్ లో ఆవుల గిరి అంటే గిట్టని కొందరు వ్యక్తులు ఎన్టీఆర్‌ను పక్కనే కూర్చోపెట్టుకొని మరీ.. ఆయనతో ప్రభాస్‌కు ఫోన్ చేపించి అత‌నితో సినిమా వ‌ద్ద‌ని చెప్పించార‌ట‌. ఈ విషయాన్ని స్వయంగా ఆవుల గిరి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్.. ప్రభాస్‌కు ఫోన్ చేయడంతోనే ప్రభాస్ తన బ్యానర్ లో సినిమా చేయలేన‌ని చెప్పేశాడ‌ని వివ‌రించారు. కాగా ఎన్టీఆర్ తో ప్రభాస్‌కు ఫోన్ చేయించినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకరు స్వయంగా నాకు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారంటూ గిరి చెప్పుకొచ్చాడు. కొందరు వ్యక్తులు ప్రభాస్ తన బ్యానర్ లో సినిమా చేయకుండా అడ్డుపడ్డారని.. అయినా నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఆవుల గిరి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.