అఖండ 2 గూస్ బంప్స్ అప్డేట్.. బాలయ్యకు గురువుగా ఆ స్టార్ హీరో..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఏజ్‌తో సంబంధం లేకుండా వరుస బ్లాక్ బాస్టర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. బోయపాటి డైరెక్షన్‌లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ఎంతో ఆసక్తికరంగా రూపొందిస్తున్నాడు బోయపాటి.

దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో గూస్ బంప్స్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారింది. ఈ సినిమాల్లో బాలయ్య కాకుండా మరో స్టార్ హీరో పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఇక సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ హిమాలయాల్లో శివ లింగంకు అభిషేకం చేస్తూ పవర్ఫుల్గా ప్లాన్ చేశాడట బోయపాటి. బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం.

Senior Hero Responded On That Affair

ఇక బాలయ్య గతంలో అఘోర పాత్రలో నటించగా ఈ పాత్రకు హ్యుజ్‌ రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి కూడా బాలయ్య అఘోర‌ మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువుగా సీనియర్ స్టార్ హీరో మురళీమోహన్ నటించిన సమాచారం త్వరలో ఆయన పాత్రకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట టీం. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.