స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానికి టాలీవుడ్ ఆడియన్స్ లో ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మరి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. ఇక బన్నీ.. దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సరైన సక్సస్‌లు అందుకోకపోవడంతో మెల్ల మెల్లగా టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ పలు సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాదు.. హన్సిక కెరీర్ ప్రారంభంలో.. తన కటౌట్‌పై పలు విమర్శలు ఎదుర్కొంది. ఇంత చిన్న ఏజ్‌లోనే హన్సిక అంత త్వరగా ఎదిగిపోవడానికి.. హార్మోన్ ఇంజక్షన్లు కారణమని సొంత తల్లిదండ్రుల ఆమెకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారని విమర్శలను ఎదుర్కొంది. దీనిపై హన్సికతో పాటు ఆమె తల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి హార్మోన్ ఇంజక్షన్ మాకు తెలియవని.. నేను ఎప్పుడు హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోలేదంటూ హన్సిక చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్లు అయినా వారికి కూడా కొంతమంది ఫేవరెట్ హీరోలు ఉంటారు. వారిపై క్రష్ ఉంటుంది. అలా హన్సిక కూడా ఓ పెళ్లయిన స్టార్ హీరో పై మోజు పడిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో లక్షలాదిమంది ఫేవరెట్ హీరోగా మారిన దుల్కర్.. హన్సిక మోత్వానికి కూడా ఫేవరెట్ హీరో అట. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక మోత్వాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఒక పెళ్లయిన హీరో తన ఫేవరెట్ హీరో అంటూ హన్సిక చెప్పడంతో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక తాజాగా హన్సిక గృహ హింస కేసులో కొర్ట్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. సోదరుడు భార్య.. తనపై గృహహింస చట్టం కింద కేసు పెట్టడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది.