టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్యాక్ డ్రాప్ తో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకునే దూసుకుపోతున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పేరుకు మెగా బ్యాక్ డ్రాప్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక చరణ్ అయితే పాన్ ఇండియన్ స్టార్ హీరోగా గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
పవన్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ సత్త చాటుతున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అంతే కాదు.. ఇప్పటికీ తన సహాయం చేసిన మూడు సినిమాల షూటింగ్ పనులకు కూడా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కు.. రామ్ చరణ్ మధ్య ఏమైనా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన చరణ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే పవన్ ఎన్నో సందర్భాల్లో చరణ్ పై ఉన్న ప్రేమ ఇష్టాన్ని చూపించిన సంగతి తెలిసిందే.
పలు ఈవెంట్లలో స్టేజ్పై అయిన మాట్లాడుతూ.. చరణ్‌ను ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. చరణ్ నటించిన సినిమాల్లో పవన్ ఫేవరెట్ మూవీస్.. మెగా అభిమానులకు కూడా ఎంతో ఫేవరెట్ సినిమాలు కావడం విశేషం. ఇంతకీ పవన్‌కు అంతగా నచ్చేసిన చరణ్ సినిమాలు ఏవో కాదు.. మగధీర, రంగస్థలం. ఈ సినిమాలు దాదాపు మెగా అభిమానులంతా ఇప్పటికీ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇక చరణ్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పట్లో వీళ్ళిద్దరి కాంబోలో మల్టీస్టారర్ వచ్చే అవకాశం లేదు. కానీ.. ఫ్యూచర్‌లో అవకాశం ఉందేమో వేచి చూడాలి.