సినీ ఇండస్ట్రీని నమ్ముకొని ఒకసారి అడుగుపెట్టిన తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు వరుస సక్సెస్‌లతో స్టార్‌గా మారతారో.. ఎవరు ఫెయిల్యూర్లతో దారుణంగా లాస్ అయ్యి డీలా పడిపోతారో ఎవరు చెప్పలేరు. ఇక ముఖ్యంగా దర్శక, నిర్మాతలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. కాగా స్టార్ ప్రొడ్యూసర్ గా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న అశ్విని దత్ లైఫ్ లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ సినిమా వల్ల ఆయన దారుణంగా లాస్ అయ్యి.. అప్పుల వాళ్ళు ఇంటిపై గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి.
అయితే ఈ సినిమా అంత పెద్ద డిజాస్టర్ కావడానికి మరో పాన్ ఇండియన్ స్టార్ హీరో మూవీ కారణం అంటూ నెటింట న్యూస్ వైరల్ గా మారుతుంది. అదే రామ్ చరణ్ హీరోగా.. జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కిన మగధీర సినిమా. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రిలేటెడ్ గా శక్తి సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేశారట. కానీ కథలో మార్పులు, చేర్పుల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కు రాకపోవడంతో.. అశ్విని దత్త్ దారుణంగా నష్టపోయాడని.. రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చరణ్ లాగా ఎన్టీఆర్‌ను తీర్చిదిద్దాలనుకున్న ఈ క్రమంలోనే సినిమా మొత్తం డిజాస్టర్ అయ్యింది. అయితే ఉన్నది ఉన్నట్లుగా శక్తి సినిమా తర్కెక్కించి ఉంటే దాన్ని రిజల్ట్ వేరేగా ఉండేదని.. సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం చివరి సమయంలో చరణ్ మగధీరను ఇన్స్పైర్ అయి.. కాస్త చేంజెస్ చేయడం అట.. దీంతో పూర్తిగా స్టోరీ దెబ్బతిందట. ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని తోట ప్రసాద్ కామెంట్స్ చేశారు.