మెగాస్టార్ చిరంజీవి – రవితేజ మల్టీ స్టారర్‌గా.. బాబి డైరెక్షన్‌లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబి బాలయ్య తో డాకుమహరాజ్ సినిమా చేసి యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో తన నెక్స్ట్ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బాబి. అయితే ప్రస్తుతం చిరంజీవి.. అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ అనీల్ రావిపూడి సినిమా ఓకే కాకపోయి ఉంటే.. ఇది వర్కౌట్ అయ్యేదేమో. ఈ సినిమా తర్వాత నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే.. ఈ సినిమా ముహూర్తం పూర్తిగా ఫిక్స్ కాలేదు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయిన తర్వాత.. బాబీకి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమాకు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనేది పెద్ద సమస్యగా మారింది. అసలే బాబి అంటే ప్రాజెక్ట్ కోసం ఎక్కువగా ఖర్చు చేసేస్తాడు.. అసలు డబ్బులను మంచినీళ్లులా ఖర్చు చేసేస్తాడని బ్యాడ్ టాక్ ఉంది. ఇక చిరంజీవి హీరో అంటే రూ.75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలి. మరో రూ.80 కోట్లు సినిమాకు ఖర్చయినా.. బాబి రెమ్యూనరేషన్ ఒక రూ.15 కోట్లు వేసుకున్నా.. మొత్తం గా రూ.170 కోట్లమేర ఈ సినిమాకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే.. మెగాస్టార్, బాబీ ప్రాజెక్ట్ అంటే నిర్మాతలు అసలు ఆసక్తి చూపడం లేదని.. దండం పెట్టేస్తున్నారని తెలుస్తుంది. ఓ పక్క మైత్రి సంస్థ, మరోపక్క డివివి దానయ్య ఇద్దరు.. మెగా బాబీ ప్రాజెక్ట్ పై మౌనం వహిస్తున్నారట. ఇక తాజాగా మెగా తనయ సుస్మిత కూడా ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుస్మితకు.. అనిల్ రావిపూడి సినిమాల్లో సగం వాటా, పెట్టుబడి ఎలాగూ ఫైనాన్స్ కనుక అసలు ఇబ్బంది లేదు. ఇంత రిస్క్ చేసి సగం లాభాలు ఆమెకు ఇవ్వడం ఏంటనేది తెలుగు జనాలకు రుచించడం లేదట. ఈ క్రమంలోని మెగస్టార్.. బాబితో సినిమా చేస్తానన్నా.. ప్రొడ్యూసర్ ఎవరు అనేది పెద్ద సందేహంగా మారింది.