మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు మరో డైరెక్టర్.. లవర్ బాయ్ గా నందమూరి హీరో..!

నంద‌మూరి నట‌సింహం బాలయ్య నటవార‌సుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ నందమూరి అభిమానులంతా కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూస్తున్న కొద్ది మోక్షజ్ఞ ఎంట్రీ అంతకంతకు లేట్ అవుతూనే ఉంది. కాగా.. చివరిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా మొదలైందని ప్రకటించిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్‌ను మరింత కన్ఫ్యూషన్‌లో పడేసింది. మోక్షజ్ఞ కోసం వినూత్నమైన కథతో ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లో రెడీ చేసిన ప్రశాంత్ వర్మ సినిమా షూట్స్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఎందుకో ప్రాజెక్ట్‌ను ఆపివేశారు అంటూ వార్తలు వినిపించాయి.

Has Prasanth Varma and Mokshagna Nandamuri's project shelved? Producers  address rumours | Telugu Movie News - Times of India

అయితే.. బాలయ్య దీనిపై రియాక్ట్ కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ పై మరిన్ని ఊహాగానాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మతో కాకుండా.. వెంకి అట్లూరి డైరెక్షన్‌లో తెర‌కెక్కనుందట. వెంకీ అట్లూరి.. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, సార్ లాంటి సినిమాలతో ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. మోక్షజ్ఞ కోసం కూడా వెంకీ అట్లూరు ఇలాంటి ఓ లవర్ బాయ్.. స్టోరీని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య ఈ కథను విన్ని.. మొక్ష‌జ్ఞ‌కు నచ్చితే వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేసేలా ప్లాన్ చేస్తున్నారంటూ.. టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.

నందమూరి మోక్షు-వెంకీ అట్లూరి Great Andhra

అంతేకాదు.. వెంకీ అట్లూరితో పాటు.. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయడానికి మరో దర్శకుడు కూడా పోటీ పడుతున్నాడట. పలువురు టాప్ డైరెక్టర్లు బాలయ్యతో ఇప్పటికే చర్చలు జరిపారని.. మోక్షజ్ఞ మొదటి సినిమా దర్శకత్వం వహించడానికి వారు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందరిలో వెంకీ అట్లూరి కథకు బాలయ్య ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారట. ఈ సినిమా ప్రేమ కథగా ఉండొచ్చని సమాచారం. ఈ క్రమంలోనే.. మోక్షజ్ఞ ఎంట్రీపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. బాలయ్య త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనున్నారట. మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో ఉండనుందని క్లారిటీ ఇవ్వనున్నాడని సమాచారం.