సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన పనులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవకు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ ఐదుగురు స్టార్ హీరోస్ ఇండస్ట్రీలో ఇప్పటికి సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలోనూ ఇంత బిజీ షెడ్యూల్లోను.. ఫ్యాన్స్ ఆనందం కోసం.. వీళ్ళు బుల్లితెరపై హోస్ట్‌గాను మెరుశారు. అంత పెద్ద స్టార్స్ అయినా బుల్లితెర ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యే విధంగా హోస్ట్ గా మెరవడం ఆడియన్స్‌లో ఆనందాన్ని కలిగించింది. అలా.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్టుగా మెరువగా, బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక తారక్ కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు మరో సీజన్ కు హోస్టుగా వ్యవహరించాడు. అంతేకాదు బిగ్ బాస్ కి కూడా తారక్ హోస్ట్ గా చేశారు.
అలాగే నేచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ షోలో ఓ సీజన్ కు హోస్ట్గా వ్యవహరించాడు. ఇక రానా దగ్గుబాటి కూడా ఇప్పటికే పలు స్పెషల్ షోస్‌లో హోస్ట్‌గా చేసి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఫ్యాన్స్ కోసం స్టార్ హీరోలుగా రాణిస్తున్న సమయంలోను ఓటీటీ షోలు బుల్లితెరపై హోస్టులుగా మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే.. వీరు కాకుండా ఎంతో మంది స్టార్ హీరోస్‌కు మొదట హోస్టింగ్ చేసే అవకాశం వచ్చినా.. వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కేవలం హీరోగా మాత్రమే నటించాలని ఉద్దేశంతో.. వారు వాటికే పరిమితమయ్యారు. కానీ.. ఈ ఐదు మాత్రం స్టార్ హీరోస్‌గానే కాకుండా హోస్టింగ్ లో కూడా తమ టాలెంట్ ను చూపించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెంచుకున్నారు.