చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, సోదరులా అనిపించేంతలా న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నాటు నాటుకు కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

RRR (soundtrack) - Wikipedia

కీరవాణి గత పాటలతో పోలిస్తే.. ఇది పెద్ద గొప్ప సాంగ్ ఏమి కాదు.. బాహుబలి పాటలు, మ్యూజిక్ అంత హైలెట్. మ్యూజిక్ కాకుండా.. ఈ సినిమాల్లో సాంగ్‌స్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఇద్దరు హీరోలే ముఖ్య కారణం. వారిద్దరి తరపున కీరవాణి, చంద్రబోస్‌కు అవార్డులు దక్కాయి అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని.. గతంలో విజయేంద్ర ప్రసాద్ వివరించిన సంగతి తెలిసిందే. కానీ.. అది ఎప్పుడు ఉంటుంది.. ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్‌ను ప్లాన్ చేశాడంటూ ఇండస్ట్రీ వ‌ర్గాల‌లో స్ట్రాంగ్ టాక్ నడుస్తుంది.

Prashanth Neel shares upcoming Jr NTR film, 'Dragon' will be a periodic  drama | - Times of India

ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రశాంత్ నీల్‌. తారక్ – ప్రశాంత్ కాంబోలో ఇప్పటికే డ్రాగన్ మూవీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఓ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నిల్. ఇక స్టోరీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని సినిమా ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్‌ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే తారక్ తో తీస్తున్న సినిమాకు కొనసాగింపుగా చరణ్ క్యారెక్టర్ ను పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. అయితే తర్వాత వచ్చే చరణ్ కొనసాగింపు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో చరణ్ నటించబోతున్నాడని.. సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నాడని టాక్‌ నడుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఏంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.