సినీ ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం అడుగుపెట్టి.. స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ నట్లుగా సక్సెస్ కావాలంటే అది సాధారణ విషయం కాదు. ఆ స్టేజ్ కు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక స్టార్ కిడ్స్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నటీ నటులుగా వచ్చిన వారికి అవకాశాలు సులభంగా వచ్చినా.. వారు కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కచ్చితంగా వారిలో టాలెంట్ ఉంటేనే మంచి నటులుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా దానిని ఉపయోగించకుండా అవకాశాలు దక్కించుకొని సక్సెస్ అందుకున్న స్టార్ కిడ్స్ చాలా తక్కువ మంది ఉంటారు.
అలాంటి వారిలో.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒకటి. నటుడు శరత్ కుమార్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. మొదట కోలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని పలు సినిమాల్లో నటించింది. అయితే ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో.. తర్వాత ప్రధాన పాత్రలోనూ, లేడీ విలన్ గాను నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో క్రాక్ సినిమాతో పవర్ ఫుల్ నెగటివ్ రోల్‌లో నటించి మెప్పించింది. దీంతో ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
ఇలాంటి క్రమంలో.. తాజాగా ఓ షోకు స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంది. ముఖ్యంగా.. తన లైఫ్ లో ఎవరైనా ఓ చేదు జ్ఞాపకాన్ని ఆమె పంచుకుంది. ఇక షోలో భాగంగా ఓ లేడి కంటెస్టెంట్.. తనకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ కాగా.. ఇది చూసిన వరలక్ష్మి తాను కూడా చిన్నతనంలో ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. నాపై ఐదుగురు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని.. నాది నీది ఒకటే కథ అంటూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.