టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరోస్, డైరెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేసి సత్తా చాటుకోగలుగుతున్నారంటే.. దానికి బీజం వేసింది రాజమౌళినే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం డైరెక్టర్ గానే కాదు.. ఒక వ్యక్తిగాను ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే జక్కన్న.. సామాజిక స్పృహ కలిగి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రాజమౌళి, రమా దంపతులకు అసలు పిల్లలేలేరు. ప్రస్తుతం రాజమౌళి కొడుకుగా ఉన్న కార్తికేయ.. రమా మొదటి భర్త కొడుకు. అయినా.. జక్కన తనను సొంత కొడుకుల చూసుకునే రాజమౌళి.. అన్ని ఫెసిలిటీస్ కల్పించాడు. అంతే కాదు.. రాజమౌళి కూతురుగా మయూఖ అనే అమ్మాయి పెరుగుతున్న సంగతి తెలిసిందే. తనను కూడా రాజమౌళి దత్తత తీసుకున్నాడు. ఎంతో అపురూపంగా ఆమెను పెంచాడు. ఇలాంటి క్రమంలోనే మయూఖకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.
రాజమౌళి మీడియాతో ఈ విషయాన్ని స్వయంగా షేర్ చేసుకున్నాడు. కూతురు మయూఖ.. ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు డై హార్ట్ ఫ్యాన్.. తనని ఒకసారి కలవాలని భావించింది. లంచ్ డేట్ కి తన ఇంటికి రమ్మన్నాడు. మాయుఖను ఎంతో గొప్పగా అతిధి మర్యాదలతో లోపలకు పిలిచి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. గొప్ప సలహాలను అందించాడంటూ రాజమౌళి వివరించాడు. మయూఖ ఇంటికి వచ్చిన తర్వాత.. సిద్ధార్థ్‌తో గడిపిన టైం నాతో చెప్పుకుంటూ ఎంతో ఆనందించిందని.. తనని కలిసి ఇంత గొప్ప జ్ఞాపకాలను పంచినందుకు సిద్ధార్థ మలహోత్రకు ధన్యవాదాలు అంటూ రాజమౌళి వివరించాడు.
ఇక మయుఖ లైఫ్‌కు మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమౌళి షేర్ చేసుకున్నాడు. ఇక సిద్ధార్ధ దీనిపై రియాక్ట్ అవుతూ.. రాజమౌళి గారు నేను మీకు బిగ్ ఫ్యాన్. నాకు మీ కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు.. మీ అమ్మాయి చాలా మంచిది. ఒక స్టార్ డైరెక్టర్ కూతురు అన్న గర్వం కాస్త కూడా లేదు అంటూ సింపుల్ గా రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే మిమ్మల్ని కూడా నేను కలుసుకుంటా అంటూ సిద్ధార్థ రిప్లై ఇచ్చాడు. ఇదంతా గతంలో జరిగిన ఇన్సిడెంట్ అయినా.. ప్రస్తుతం మరోసారి వైరల్‌గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.