అన్‌స్టాపబుల్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్.. రూ. 83 లక్షలు పోగొట్టుకున్నాడు..!

బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. యూట్యూబర్స్‌తో మొదలైన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. సెలబ్రిటీస్ వరకు పాకుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, ప్రకాష్ రాజ్ ఇలా మొత్తం 25 మంది యూట్యూబర్లపై.. ఈ బెట్టింగ్ యాప్ విషయంలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఇదే లిస్టులో చేరుకుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Unstoppable with NBK season 2' trailer unveiled; here's what netizens think  - Times of India

హీరో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షోలో.. ఫన్ 88 బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం ప్రస్తుతం సంచలనం సృష్టించింది. అన్‌స్టాపబుల్ చూసి ఫ‌న్‌88 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏకంగా రూ.83 లక్షలు నష్టపోయానంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. యాప్ డౌన్లోడ్ చేశానని.. ఇక ఈ బెట్టింగ్ వల్ల రూ.83 లక్షల పోగొట్టుకున్నాను అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

మొదటిసారి రూ.10వేలు పెట్టా రూ.18వేలు వచ్చాయి. అలా వస్తూ.. పోతూ.. రూ.3లక్షల దాకా సంపాదించడంతో.. ఆ డబ్బులతో అప్పులు కట్టేసా అంటూ వివరించాడు. డబ్బులు వచ్చాయి కదా అని మళ్ళీ ఆడా.. తర్వాత డబ్బులు పోవడం ప్రారంభమైంది. ఊర్లో బంధువులు, తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి మొత్తం రూ.83 లక్షలు పోగొట్టుకున్నాను అంటూ బాధితుడు వెల్లడించాడు. అప్పుల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కేస్‌పై పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.