సినీ ఇండస్ట్రీలో సార్ హీరో, హీరోయిన్లుగా.. డైరెక్టర్లుగా సక్సెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు మాత్రం.. సూపర్ సక్సెస్‌లు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో కూడా.. ఫ్లాప్ హీరోలను ఎంచుకొని వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించి.. వీళను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటారు. కానీ.. ఆ దర్శకులు డౌన్ పాలైన సమయంలో హీరోలు మాత్రం వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి తమ సినిమాలతో తాము బిజీ అవుతుంటారు. ఇక పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ అయితే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు పోకిరి సినిమా ఒకటి. ఈ సినిమా మహేష్ ను ఇండస్ట్రీలో మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో నిలబెట్టింది. మహేష్‌కు ఓ ఇండస్ట్రియల్ హిట్ సొంతమయింది.
ఇక ఈ సినిమాకు ముందు వరకు మహేష్ స్టార్ హీరోగా ఇమేజ్ను సంపాదించుకోలేకపోయారు. కానీ.. పోకిరితో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేశాడు. తర్వాత.. బిజినెస్ మాన్‌తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే.. పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో.. మహేష్ బాబు మాత్రం అస్సలు అవకాశం ఇవ్వలేదు. జగన్నాథ్ సినిమా చేసే సమయం తనకు లేదు అన్నట్లు మహేష్ ఇప్పటికి వ్యవహరిస్తున్నాడట. మరి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఈగో క్లాషెస్ వచ్చాయో తెలియదు. కానీ.. మహేష్ ఇతర దర్శకులు అందరికీ అవకాశాలు ఇచ్చిన పూరీ జగన్నాథ్ ను మాత్రం పక్కన పెట్టాడంట ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు అభిమానులు కూడా దీనిపై నిరాశ వ్యక్తం చేశారు.
మహేష్ లో ఉన్న పూర్తి పొటెన్షియల్ బయటకు తీయడం పూరి వల్లే అవుతుందని.. కానీ మహేష్ ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వటం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం అసంభవం. అలాగే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ సైతం టాప్ డైరెక్టర్గా రాణిస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చి మీడియంలో హీరోలు స్టార్ హీరోగా ఎదిగే వరకు కృషి చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించాడు. తనను స్టార్ హీరోగా మార్చాడు. అయితే త్రివిక్రమ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేదన్న ఆలోచనతో.. బన్నీ ప్రస్తుతం ఆయనను పక్కన పెట్టేసి అట్లీతో సినిమా చేస్తున్నాడని సమాచారం. దీన్ని బట్టి.. స్టార్ డైరెక్టర్లు ఫ్లాప్ హీరోలను, మీడియం హీరోలను.. స్టార్ హీరోలుగా నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. మన స్టార్ హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఫ్లాప్ డైరెక్టర్లు అవకాశాలను ఇచ్చి వారికి సహాయం అందిస్తున్నారు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.