సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. మరి కొంతమంది ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఎప్పటికీ అవకాశం దక్కుతుందో చెప్పలేరు. అలా.. లేటు వయసులో అవకాశాలు దక్కించుకొని తమ సత్తా చాటుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అదే కోవకు చెందుతాడు నటుడు మురళీధర్ గౌడ్. బలగం సినిమాతో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒక్కో సినిమాలో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ నటుడుగా, క్రేజ్ దక్కించుకున్నాడు. ఏడాదిలో రెండు, మూడు ప్రాజెక్టులతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
అలా.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న మురళీధర్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. యాంకర్ వర్షను మాట్లాడనివ్వకుండా ఆయన కామెంట్స్ తో ఆట ఆడేసుకున్నాడు. షో పేరు చెబుతుండగానే.. కిస్ మీ నా అంటూ కామెంట్ చేశాడు. అనంతరం ఆయన సినిమాల గురించి కీలక విషయాలను షేర్ చేసుకున్న మురళీధర్.. ముఖ్యంగా త్వరలోనే రిలీజ్ కానున్న మ్యాడ్ 2 సినిమాలో వర్షతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాల్లో ఆయన వర్షతో కలిసి నటించిన సీన్ హైలెట్ కానుందట. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన జరిగిన ఫోర్డ్ కాస్టింగ్ సంభాషణ కామెడీగా ఉండనుందని ప్రోమోతో అర్థమవుతుంది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో వర్ష మాట్లాడుతూ.. తాజాగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ప్రశ్నించింది. మూవీ సూపర్ హిట్ అయింది కదా.. మూవీలో మీరు నటించడం ఎలా ఫీలయ్యారు అని వర్షా అడగగా.. ఈ మూవీని ఎందుకు చేశానా అని బాధపడ్డా అంటూ మురళీధర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటి సినిమా మంచి సక్సెస్ అయింది కదా.. మీరు ఎందుకు అలా అంటున్నారు అని ప్రశ్నించగా.. దానికి ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నన్ను డాడీ అంటుంది, అటు మీనాక్షి చౌదరి ఓమో బాబాయ్ అని పిలుస్తుంది. అందుకే నాకు చాలా బాధగా అనిపించింది. ఈ సినిమాని ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యా అంటూ ఫన్నీగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం మురళీధర్ గౌడ్ ఫన్నీ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.