నాగచైతన్యకు ఫ్రెండ్ గా, హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

నాగార్జున నటవారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించింది అతితక్కువ సినిమాల్లోనే.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చైతు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన సినిమాల్లో ఒకేఒక్క హీరోయిన్ ఆయనకు తల్లిగాను, భార్యగానూ , అలాగే ఫ్రెండ్ గానూ నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Lavanya Tripathi

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ ఆడిమ‌య‌న్స్‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగారు రాజు మూవీ తర్కెక్కిన సంగతి తెలిసిందే. ఇక‌ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. కాగా ఈ ప్రాంచైజ్‌ల్లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా మెరిసారు.

Lavanya Tripathi Special Appearance | Naga Chaitanya | Manam Song Kanulanu  Thaake - Filmibeat

కాగా నాగార్జున తండ్రి, అలాగే కొడుకు పాత్రలో మెరువగా.. నాగ చైత‌న్య మ‌న‌వ‌డిగి, కొడుకుగా క‌నిపించాడు. ఇక తాత నాగార్జున పక్కన.. రమ్యకృష్ణ నటించింది. అలాగే కొడుకు పాత్రలో చేసిన నాగార్జున పక్కన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా మెరిసింది. ఈ జంటకు కొడుకుగా నాగచైతన్య మెరిశారు. rj నాగచైతన్య తల్లి పాత్రలో లావణ్య కనిపించింది. అంతే కాదు ఈ సినిమాకు ముందు.. యుద్ధం శరణం సినిమాలో చైతు, లావణ్య హీరో హీరోయిన్గా మెరుసారు. ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో.. ఈ ఇద్దరూ స్నేహితులుగాను కనిపించారు. ఇలా లావణ్య త్రిపాఠి.. నాగచైతన్యకు ఫ్రెండ్ గా, తల్లిగా, భార్య‌గా నటించిన ఏకైక హీరోయిన్‌గా నిలిచింది.