నాగార్జున 100వ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున.. ఏఎన్ఆర్ న‌ట‌వార‌సుడిగా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుని.. టాలీవుడ్ టాప్ 3 హీరోలలో ఒకరిగా ఇముజ్ క్రియేట్ చేసుకున్నారు. కామెడీ, మాస్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, భక్తిరసం ఇలా అన్ని రకాల జాలర్లలో నటించి మెప్పించిన నాగార్జున.. హలో బ్రదర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ సినిమాలు తోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ రోజుల్లోనే అన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాల్లో తన సత్తా చాటుకునన నాగ్ యంగ్‌ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. యంగ్ లుక్, ఫిట్నెస్తో అమ్మాయిల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఆయనకు బాడ్ టైం నడుస్తుంది.

Karthik R (@rakarthik_dir) • Instagram photos and videos

ఈ క్రమంలోనే ప్రయోగాత్మక సినిమాలు చేసి మరి ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు నాగార్జున. కానీ.. గతంలో ఆయన చేసిన ఎన్నో ప్రయోగాత్మక సినిమాలతో సక్సెస్‌లు అందుకుని.. టాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే.. మరోసారి కంటెంట్ ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక నాగార్జున తన సినీ కెరీర్‌లో ఎప్పటి వరకు 99 సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నాగ్ 100వ సినిమా ఎవరితో ఉండబోతుంది.. బడ్జెట్ ఎంత అనే అంశాలపై అభిమానుల్లో ఆశ‌క్తి నెల‌కొంది. కానీ.. దాదాపు ఏడదిన్నరగా నాగార్జున సోలో హీరోగా సినిమాల్లో నటించడం మానేసిన సంగతి తెలిసిందే.

Nagarjuna's 100th film Details - Telugu360

ఈ క్రమంలోనే తాజాగా ఆయన 100వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఆయన 100 సినిమాకు ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త‌న 100వ సినిమా ఆయన కెరీర్‌లోనే ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ ను తన వందవ‌ సినిమాకు దర్శకుడుగా నాగ్‌ ఎంచుకున్నట్లు సమాచారం. తమిళ్‌లో ఈయన తాజాగా ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ చేసి మిక్స్డ్ టాక్ అందుకున్నాడు. ఈ క్రమంలోని నాగార్జున వందో సినిమా కోసం.. ఆ డైరెక్ట‌ర్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.