నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్టు మూవీ అతి తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ ఇప్పటికైనా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల షేర్ కలక్షన్‌ల టార్గెట్ తో రిలీజ్‌లో భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీలో కొత్త నటులు.. కుర్ర హీరో రోషన్, హీరోయిన్గా శ్రీదేవి నటించి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. చక్కని ప్రేమ కథని నాని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాదు.. మెసేజ్ ఓరియంటెడ్ మూవీగాను కోర్ట్ బాగా కనెక్ట్ అయింది.
ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా హీరోగా రోషన్‌కు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న టాక్ ప్రకారం.. రోషన్‌తో దిల్ రాజు టీం చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న దిల్ రాజు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ రాణిస్తున్నారు. బలగం సినిమా డైరెక్టర్ వేణు ప్రస్తుతం ఎల్లమ్మ సినిమాను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
మరి కొన్ని చిన్న సినిమాలకు ఆయన బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిన్న సినిమాలు రూపొందించేందుకు ఈ టీం ప్లాన్ చేస్తున్నారట. అందులో కోర్ట్ సినిమాకు హీరోగా రోషన్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. రోషన్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే రోషన్, దిల్ రాజు కాంబోలో సినిమా సెట్స్ పైకి రానంది అంటూ టాక్. ఇక ఈ సినిమాలో రోషన్ తో పాటు.. కోర్టులో విలన్ పాత్రలో నటించిన శివాజీని సైతం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. రోషన్, శివాజీ కీలకపాత్రలో దాదాపు సినిమా కన్ఫామ్ అయిపోయిందని.. దానికి తెల్ల కాగితం అనే టైటిల్ ని కూడా దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు టాక్.