భారతరత్న ఎంత ప్రతిష్టాత్మక పురస్కారం అందరికీ తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును.. సౌత్ లోని టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అందుకోనున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏ రంగంలోనైనా సరే అసాధారణ సేవలతో అత్యుత్తమ పనితీరుతో అందరిని ఆశ్చర్యపరిచి ఆకట్టుకునే వారికి ఈ అవార్డును అందిస్తూ ఉంటారు. ఈ ఏడదిలో కేవలం ముగ్గురికి మాత్రమే ఈ భారతరత్న పురస్కారం అందింది. అయితే.. 2025 ఏడాదికిగాను సౌత్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజాను భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం బహుకరించనుందని సమాచారం.
ఈ ఉగాదిలోపు దీనిని అఫీషియల్ గా ప్రకటించనున్నారట. ఇక మాస్ట్రో ఇళయరాజా పేరు వింటేనే ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ పులకరించి పోతారు. ఆయన సాంగ్స్‌ను వారు కూడా తమకు నచ్చిన స్టైల్ లో కూని రాగాలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తమ పాటలతో అంతలా సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్న ఇళయరాజా.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు సమాచారం. 30 సంవత్సరాల సినీ జీవితంలో వివిధ భాషల్లో దాదాపు 5వేలకు పైగా పాటలతో పాటు.. 1000 సినిమాలకు పైగా సంగీత దర్శకుడుగా వ్యవహరించి రికార్డును క్రియేట్ చేసుకున్న ఇళయరాజా.. బిజెపి రాజ్యసభ సభ్యులను కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయనకు 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారాన్ని అందించగా.. 2018లో పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. అంతేకాదు ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇప్పటికే 7సార్లు జాతియ అవార్డులు అందుకున్న ఇళయరాజా.. రికార్డును క్రియేట్ చేశాడు. దేశంలోనే అత్యుత్తమమైన 24 అవార్డులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా వాలెండ్ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ లండన్‌లో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈయన అక్కడ వెస్ట్రన్, క్లాసికల్, సింపోని మ్యూజిక్ లను నిర్వహించిన మొట్టమొదటి ఏషియన్ మ్యూజిక్ కంపోజర్ గాను రికార్డ్ సృష్టించారు.