టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన ఇదే ట్యాగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ ట్యాగ్ కోసం గట్టి పోటీనే నెలకొందట. అప్పట్లో చిరంజీవికి పోటీ ఇచ్చిన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కాకుండా మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ట్యాగ్ కోసం చాలా కష్టపడ్డారని టాక్. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలుగా చిరు, నాగ్, బాలయ్య, వెంకీలే రాణించారు. వీళ్ళ తర్వాత టైర్ 2 హీరోలుగా ఇతర హీరోలను పిలుచుకునే వాళ్ళు.
మోహన్ బాబు, రాజశేఖర్, సుమన్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ లాంటి వారు ఈ లిస్టులో ఉండేవారు. కానీ.. ఓ స్టేజ్‌లో చిరంజీవికి గట్టి పోటీ ఇస్తూ.. రాజశేఖర్, సుమన్‌లు యాక్షన్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. బాలయ్య, వెంకీ, నాగార్జున ఫ్యామిలీ, లవ్, ఎమోషనల్ స్టోరీస్ చేసుకుంటూ పోతుంటే.. వీరు మాత్రం యాక్షన్ సినిమాలతో దుమ్మురేపారు. 1980 – 90లో చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన ఈ ఇద్దరు సీనియర్ హీరోస్ మెగాస్టార్ టాగ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. అయితే వీళ్ళకు మెగాస్టార్‌కు మధ్యన తేడా చిరు మెస్మరైజింగ్ డ్యాన్స్, ఓన్ డబ్బింగ్. అప్పట్లో చిరంజీవి డ్యాన్సులకు.. పవర్ ఫుల్ డైలాగ్‌లకు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేవారు.
దీనికి తోడు ఆయన వ్యక్తిత్వం, మంచితనం కూడా ఆయనకు మెగాస్టార్ ట్యాగ్ తెచ్చిపెట్టాయి. ఇక సుమన్, రాజశేఖర్ ఆయనలా డ్యాన్సులు, సొంత డబ్బింగ్‌లు చేయలేక సింపుల్‌గా మానేజ్ చేసేవారు కెరీర్‌లోనే ఈ హీరోలకు అది బిగ్ మైనస్ గా మారింది. ఇద్దరు హీరోలు సాయికుమార్ పైన ఆధారపడి డబ్బింగ్ బ్యాలెన్స్ చేశారు. అంతేకాదు.. వీళ్లిద్దరు చుట్టూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాలు వెంటాడుతూనే ఉండేవి. సుమన్ బ్లూ ఫిలిం కేసులో దెబ్బతింటే.. రాజశేఖర్ తన కోపంతో కోపిస్తుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆవేశంతో అందర్నీ మేనేజ్ చేయలేకపోయినా రాజశేఖర్.. డ్యాన్సులు కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఈ క్వాలిటీస్ అన్ని అయన సినీ కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ గా మారాయి. ఏదేమైనా తనదైన యాక్షన్ సినిమాలతో రాజశేఖర్ మాత్రం చిరుకు గట్టి పోటీనే ఇచ్చారు అనడంలో సందేహం లేదు.