గత కొంతకాలంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్.. బోల్ట్ హుక్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేస్తూ ప్రజలలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఎన్నో నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. అసభ్యకర, అభ్యంతర డ్యాన్స్ స్టెప్పులు ఏంటి అంటూ.. మహిళలను కించపరిచేల ఈ స్టెప్స్ ఉన్నాయంటున్స్ రకరకాల కామెంట్స్‌తో వారిపై మండిపడుతున్నారు. అలా.. తాజాగా నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలోని ఓ హుక్ స్టెప్ మరింత అసభ్యకరంగా, బోల్డ్‌గా అనిపించడంతో.. విపరీతమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ఖు ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు.. దీనిపై రియాక్ట్ అయింది.
కొన్ని సినిమాల్లో ఉపయోగిస్తున్న బోల్డ్ స్టెప్‌లు మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా ఉన్నాయని వివరిస్తూ.. ఈ అంశంపై తీవ్రంగా మండిపడింది మహిళా కమిషన్. సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు సహా సంబంధిత వర్గాలకు క్లియర్ వార్నింగ్ ఇచ్చేసింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే ఓ శక్తివంతమైన మాధ్యమం. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత సినీ ఇండస్ట్రీ వారికి కచ్చితంగా ఉంటుంది. మహిళలను తక్కువ చేసి చూపేలా అసభ్యకరంగా ప్రదర్శించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే ఆపియండంటూ మహిళ కమిషన్ ఆదేశించింది. ఎవరైనా ఈ వార్నింగ్ లైట్ తీసుకుంటే.. కఠిన చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా పాటలు యువత మరియు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయని.. అలాంటి అసభ్యకరమైన కంటెంట్ సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉందంటూ మహిళ కమీషన్ పేర్కొంది.
కనుక సినీ రంగం స్వీయ నియంత్రణ పాటించి సమాజానికి.. సానుకూల సందేశాలు అందించాలని వెల్లడించింది. అంతేకాదు.. ప్రజలు, సామాజిక సంస్థలు కూడా తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయాలని.. దీనిపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తామంటూ వెల్లడించింది. అవసరమైన మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చింది. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు తమ భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఇలాంటి హుక్ స్టెప్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విమర్శకులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళల గౌరవాన్ని కించపరచకుండా కాపాడేలా సినిమాలు ఉండాలని అంతా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.