ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఇండియాస్ నెంబర్ వన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్గా స్థానాన్ని దక్కించుకుందట. ఇక నేషనల్ క్రష్ రష్మిక, త్రిష, సాయి పల్లవి, నయన్‌లకు బిగ్ షాక్ తగిలింది.
కొంతకాలంగా సౌత్ టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వీరు కనీసం టాప్ 2లో కూడా స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. బాలీవుడ్ బ్యూటీ ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ ఈ లిస్టులో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కల్కి 2898 హీరోయిన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే 3వ స్థానం, సాయి పల్లవి 4వ స్థానంలో నిలిచారు. ఇక లతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే కాజల్ అగర్వాల్ ఈ లిస్ట్‌లో 5వ స్థానం దక్కించుకుంది. ఇక కాజల్‌కు కూడా ప్రస్తుతం సినిమాలే లేవు. పెద్దగా వార్తల్లోనూ లేదు. కానీ.. కాజల్ 5వ స్థానం దక్కించుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.
ఛావా సినిమాలతో ఇటీవల రష్మిక పేరు మారుమోగిపోయింది. దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఈమె సినిమాలు బిజినెస్ లు చేశాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాల్లో నటిస్తుంది. ఇలాంటి క్రమంలో టాప్ 5లో కూడా రష్మిక మందన స్థానాన్ని దక్కించుకోలేకపోవడం షాక్. ఇక ఈ లిస్టులో రష్మిక 6వ స్థానంలో నిలిచింది. అజిత్ పట్టుదల సినిమాలో హీరోయిన్గా నటించిన సక్సెస్ అందుకున్న త్రిష 7వ స్థానంలో నిలిచింది. ఇక 8వ స్థానంలో నయనతార చోటు దక్కించుకుంది. పుష్ప 2తో కిసికకున మెరిసిన శ్రీ లీల 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక త్వరలోనే ఘాజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న అనుష్క శెట్టి పదో స్థానంలో నిలవడం విశేషం.