ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన బాలకృష్ణ నటించిన డిజాస్టర్ మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ అందుకున్న తర్వాత.. ఎంతోమంది డైరెక్టర్లు ఆ సెలబ్రెటీల ఇంటికి క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో కథలను వినిపిస్తూ ఉంటారు. కానీ.. హీరోలు లేదా, హీరోయిన్‌లు మాత్రం ఆ కథ అటు ఇటుగా అనిపించిన.. ఫ్లాప్ అవుతుందని ఆలోచన వచ్చిన వెంటనే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్‌ పైకి వచ్చిన తర్వాత.. సగం షూట్ అయిన‌ తర్వాత కూడా ప్లాప్ అవుతుంద‌ని డౌట్‌తో షూట్ ఆపించేసిన స్టార్ హీరోస్ కూడా చాలామంది ఉన్నారు. అయితే నందమూరి నట‌సింహం బాలకృష్ణ మాత్రం ఓ సినిమా కథ ఫ్లాప్ అవుతుందని తెలిసినా.. కావాలనే ఆ సినిమాలో నటించారట. ఇంతకీ ఆ సినిమా స్టోరీ ఏంటి.. ప్లాప్ అవుతుందని తెలిసిన.. బాలయ్య సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.

A. Kodandarami Reddy - Wikipedia

బాలయ్య‌ సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కొన్ని సినిమాలు ఫ్లాపులు గాను మారాయి. అయితే ఒకే ఒక సినిమా మాత్రం ఫ్లాప్‌ అవుతుందని తెలిసిన బాలకృష్ణ నటించాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. తిరగబడ్డ తెలుగు బిడ్డ. ఈ సినిమా చేయడం బాలయ్య‌కు అసలు ఇష్టం లేదట. ముందే సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన ఫిక్స్ అయ్యారట. డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది ఆపేద్దామని అనుకున్నాడట. కానీ.. ఎన్టీఆర్ మాత్రం నాకు ఈ కథ బాగా నచ్చింది కచ్చితంగా ఈ సినిమాను చేసి తీరాలి అని చెప్పడంతో ఎక్కువ హోప్స్ లేకుండా సింపుల్ గా కథను లాగించేసారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి వెల్లడించారు.

Tiragabadda Telugubidda Telugu Full Movie || Balakrishna, Bhanu Priya

ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైంలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాకు దర్శకత్వం వహించానని.. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్.. బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించే బాధ్యత నాకు అప్పగించారు. అలా రెడీ చేసిన స్టోరీనే తిరగబడ్డ తెలుగు బిడ్డ అంటూ చెప్పుకోచ్చాడు కోదండరామిరెడ్డి. కానీ.. ఆ కథ నాకు నచ్చలేదు. అప్పుడే ఆ సినిమా వదిలేసా. అంతేకాదు.. బాలయ్య కూడా ఈ స్టోరీ ఫ్లాప్ అవుతుంది నేను నటించనని చెప్పాడట. కానీ.. ఎన్టీఆర్ ఈ సినిమాను తీయాల్సిందే.. ఈ కథ జనాల్లోకి వెళ్లాల్సిందేనని పట్టుపట్టడంతో కాదనలేక.. ఇష్టం లేకపోయినా ఈ సినిమాలో నటించాడట. ఇక ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియలేదు. బాలయ్య కెరీర్‌లోనే పెద్ద డిసాస్టర్ గా ఈ సినిమా నిలిచింది.