టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంట్రెస్ట్ లోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఎన్నో హిట్ సినిమాలుకు సీక్వెల్స్ కానీ.. రీమేక్ కానీ వస్తే బాగుండని.. అందులో పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ నటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాల్లో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ డిమాండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు చిరంజీవి కూడా అది నా కోరిక కూడా అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవి నటించిన మరో బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ తను చేయాలని ఆశపడ్డారట.
ఆ సినిమా రీమేక్ కూడా సిద్ధమయ్యాడట. అదే చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటైన ఖైదీ. ఈ సినిమాకు రీమేక్ చేయాలని పవర్ స్టార్ ఎంతగానో ఆరాటపడ్డాడట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరు ఖైదీ మూవీ అంటే పవన్‌కు చాలా ఇష్టమట. ఈ సినిమాకు రీమేక్ కానీ.. సీక్వెల్ కానీ చేయాలని.. పవన్ జానీ సినిమా తర్వాత ఎంతగానో ప్లాన్ చేశాడట. డైరెక్టర్ వీర శంకర్‌ను పిలిచి.. నాకు వేరే కథలు వద్దు. అన్నయ్య ఖైదీ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉంది. అలాంటి కథ ఏదైనా ప్లాన్ చేయండి అంటూ వీర శంకర్‌కు చెప్పాడట. కానీ.. ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే.. ఖైది ఆధారంగా స్టోరీ లైన్ మాత్రం మీరే రెడీ చేయాలి. మరో రచయిత సహాయం తీసుకోవద్దని వివరించాడట. స్టోరీ లైన్ ఓకే అయ్యాక పూర్తి కథని ఇతర రచయితల సహాయంతో చేయొచ్చు అని వివరించాడట.
దీంతో వీర శంకర్ టెన్షన్ పడుతూ.. నా దగ్గరకు వచ్చాడంటూ తోట ప్రసాద్ వివరించాడు. పవన్ కళ్యాణ్ మూవీ అనగానే నేను కంగ్రాట్స్ చెప్పాను. ఇద్దరం కూర్చుని ఖైదీ ఆధారంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ స్టోరీ లైన్ ప్రిపేర్ చేసాం. పవన్ కు ఆ లైన్ నచ్చేసింది. వెంటనే ఓకే చేశారు. కథను డెవలప్ చేయమని నాగబాబు ఒక రచయితను రికమెండ్ చేశారట.. అలాగే మీ తరఫున మరో రచయితను తెచ్చుకోమని వీరశంకర్‌కు చెప్పారట. వీర శంకర్ ఆ టైంలో నన్ను కాకుండా మరో రచయితను తీసుకున్నారు. దాంతో నేను బాగా హర్ట్ అయ్యా అంటూ తోట ప్రసాద్ వివరించాడు. నన్ను తీసుకున్నే అవకాశం ఉన్నా.. ఎందుకు తీసుకోలేదు అని అడిగితే ఆ టైంలో నువ్వు మాటీవీలో జాబ్ చేస్తున్నావ్.. ఎందుకు డిస్టర్బ్ చేయడం అనిపించింది అంటూ వీర శంకర్ వివరించాడట. ఇక తర్వాత ఏవో కారణాలతో సినిమా ఆగిపోయింది. అలా పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న ఖైదీ సీక్వెల్ కోరిక తీరకుండానే మిస్ అయ్యింది.