మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం RC16 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు.. జాన్వి కపూర్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో.. సినిమా సెట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ భార్య ఉపాసన.. జాన్వీ కపూర్ కు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిన ఉపాసన.. సరదాగా టీంను సర్‌ప్రైజ్ చేసింది. దీంతో పాటు.. జాన్వి ని స్పెషల్ గిఫ్ట్ తో ఆకట్టుకుంది. ఉపాసన అత్తగారు.. చరణ్ తల్లి అయిన సురేఖ.. జాన్వి కపూర్ కోసం ఒక్క స్పెషల్ గిఫ్ట్ ను పంపించింది.
ఇంతకీ ఆ స్పెషల్ గిఫ్ట్ మారేదో కాదు.. అత్తమ్మస్ కిచెన్ కిట్. సురేఖ, ఉపాసన, అంజనాదేవి ముగ్గురూ కలిసి అత్తమ్మస్ కిచెన్ పేరుతో స్పెషల్ రెసిపీ లను ఆన్లైన్ ద్వారా సేల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ స్పెషల్ రెసిపీ ఐటమ్స్ క్యూట్ కిట్.. జాన్వి కపూర్ కు ఉపాసన గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. త్వరలో దీనిని బ్రాండ్ గా ప్రమోట్ చేయనున్నారని.. అందుకే జాన్వి చేత ప్రమోషన్స్ ను ప్రారంభించారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక చరణ్ హీరోయిన్ కి.. అయిన తల్లి, భార్య కలిసి స్వయంగా ఓ సర్ప్రైజ్ ను ప్లాన్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. దీన్ని సోషల్ మీడియా ద్వారా జాన్వీ కపూర్ షేర్ చేసుకోవడం మరింత హైలెట్ గా మారింది.
ఇక ఆర్సి 16 మూవీస్ స్ఫోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కబడ్డీ, కుస్తీ, క్రికెట్‌ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఇందులో చరణ్ ఓ బ్లైండ్ రోల్‌లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాదు.. సినిమాకు సంబంధించిన టైటిల్ అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. మొదట సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. అదే టైటిల్ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసారని.. త్వరలోనే దీన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం ఢిల్లీలో జరుపుతున్నారు. త్వరలోనే షూట్ అంతా పూర్తిచేసి ఈ ఏడాది చివరికి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు టీం.