టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా సెట్స్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. కాగా.. తాజాగా ఈ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భారీ పర్సనాలిటీతో.. పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక కన్నడ స్టార్ డైరెక్టర్‌గా ప్రశాంత్ కేజీఎఫ్‌తో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారి దూసుకుపోతున్నాడు ప్రశాంత్ నీల్. తను తెరకెక్కించింది అతి తక్కువ సినిమాలైనా.. ఇండియాలోనే పెను ప్రభంజనంగా మారాడు.
ఇక ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలన్నీ ఒకే ఎత్తు అయితే.. తారక్‌తో రానున్న సినిమా మరో లెవెల్‌లో ఉండనుందని సమాచారం. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాలను మరింత సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ సినిమాని తెరకెక్కించి రూ.800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాతో.. ఏకంగా రూ.2000 కోట్లకు టార్గెట్ పెట్టుకొని కసిగా పనిచేస్తున్నాడట. ప్రశాంత్ ఈ సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ క్రేజ్ ను దక్కించుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఇక దీనికోసం తారక్‌ని విపరీతంగా కష్టపెడుతున్నాడట.
అంతేకాదు సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన గూస్‌బంప్స్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ షర్ట్ విడిచి.. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ పవర్ఫుల్ ఫైట్ సీన్స్‌లో కనిపించనున్నాడని యూనిట్ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక తారక్ బాడీ చాలా ఫీట్ గా ఉంటుంది. కానీ.. అతనికి సిక్స్ ప్యాక్ బాడీ ఇప్పటివరకు చూపించలేదు. మరి ఈ సినిమా కోసం తారక్ ఆ సిక్స్ ప్యాక్ బాడీని తెచ్చుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నాడని.. ప్రశాంత్ నీల్ దానికి తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాల్లో ఎన్టీఆర్ను భారీగా చూపించాలంటే సిక్స్ ప్యాక్ బాడీ కావాల్సిందేనని.. ఇందులో భాగంగానే కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్లో పెద్ద ఫైట్స్ లో షర్ట్ లేకుండా కనిపిస్తూ ఒక్కొక్కడి తాట తీయడం.. చూసే ఆడియన్స్ అందరూ.. హై ఫీల్ కు లోనవుతారనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్.. ఇలాంటి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా నేచురల్ గా ఉంటే.. ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతి కలుగుతుందని ఆయన భావించాడట. తను అనుకున్నట్లుగానే సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా.. లేదా.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. వేచి చూడాలి.