టాలీవుడ్ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ మునుపెన్నడు లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని సమాచారం.
ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. గతంలో.. మహేష్ బాబు నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిందని సమాచారం. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్ కెరీర్‌లోనే.. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మహర్షి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాల్లో అల్లరి నరేష్.. మహేష్ బాబు ఫ్రెండ్ రోల్లో మెరిసాడు, అల్లరి నరేష్ నటించిన కీలక పాత్ర అప్పట్లో ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయింది, నిజానికి ఈ పాత్ర కోసం మొదట నాచురల్ స్టార్ నానిని అప్రోచ్ అయ్యారట, కానీ నాని ఇది గెస్ట్ పాత్రగా ఉండడంతో,, మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాల అది కూడా లీడ్ లేని పాత్రలో నటించడం అంటే.. అసలు సరికాదని ఉద్దేశంతో.. రిజెక్ట్ చేసాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ వైరల్ గా మారుతుంది.