అక్కడ తారక్ క్రేజ్ పిక్స్.. కటౌవుట్ పెట్టి మరి పూజలు చేస్తున్న లేడీ ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024న‌ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని కొరటాల మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా, జాన్వి కపూర్ హీరోయిన్గా మెరిసి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా దేవర పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.172 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.

Man of Masses NTR Jr to conquer Japan again with the release of 'Devara:  Part 1' on March 28 - Filmibeat

మొత్తంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి.. ఆరు కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూస్ ఆటతో 100రోజులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఓటిటి లోను రిలీజ్ అయి మంచి వ్యూస్ దక్కించుకొని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు పొందిన నాలుగో సినిమాగా సంచలనం క్రియేట్ చేసింది. త్వరలోనే జపాన్లో రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమా.. మార్చి 19, 2025న జ‌పాన్‌ ప్రైవేట్ రివ్యూ స్క్రీనింగ్ పూర్తి చేసుకుంది. అక్కడ కూడా దేవర మంచి టాక్ అందుకోవడంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇక ఇప్పటికే తారక్‌ఖు జపాన్‌లో మంచి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే గతంలో ఎన్టీఆర్, చరణ్ కాంబోలో తెర‌కెక్కిన మల్టీస్టారర్ అక్కడ భారీ సక్సెస్‌ అందుకొని సంచలనం సృష్టించింది. దీంతో దేవర రిలీజ్ పై జపాన్ ఆడియన్స్‌లో సందడి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి.. జపాన్ లేడీ ఫ్యాన్స్ ఆయన పూజిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. దేవర పార్ట్ 2 గురించి.. అఫీషియల్ ప్రకటన రాకున్నా.. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.