ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. తర్వాత బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ తో పాపులారిటీ దక్కించుకుంది. ఇక 2008లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత 2009 ఫాంటసీ కామెడీ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత తను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.
అయినా ఈ అమ్మడి అందం హాట్‌నెస్‌తో పలు సినిమాల స్పెషల్ సాంగ్స్ లో అవకాశాలు కొట్టేసింది. అయితే సినిమా కంటే వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా పాపులారిటి దక్కించుకుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు మీద ఓ సొంత ఐలాండ్ కూడా ఉంది. ఇంత చెప్పాము కదా.. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా.. సర్లేండి అది కాస్త కష్టమే మేమే చెప్పేస్తాం. తనే జాక్వాలిన్ పెర్నాండేజ్. అలాఉద్దీన్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రెస్ 2 ఇలా వైవిధ్యమైన సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకుంది.
ఇక జాక్వాలిన్ నార్త్ తీరంలో ఉన్న నాలుగు ఎకరాల ఓ ఐలాండ్‌ను 2012లో రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసి.. తన సొంతం చేసుకుంది. అయితే ఈ ఐలాండ్‌ను మరింత స్పషల్‌గా మార్చేందుకు.. అధునిక సదుపాయాలతో ఓ గ్రాండ్ గెస్ట్ హౌస్ కట్టుకొవాలని భావిస్తుందట. పలు నివేదికల ప్రకారం జాక్వలిన్ ఆస్తులు ప్రస్తుతం రూ.160 కోట్లకు పైగానే ఉంటాయని సమాచారం. అలాగే ఆమె సంవత్సరానికి రూ.15 కోట్లకు పైగా కూడా పెడుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు చేతినిండా క్రేజి ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతుంది.