” మ్యాడ్ 2 ” స్పెషల్ సాంగ్ లో కత్తిలాంటి హాట్ బ్యూటీని సెట్ చేసిన టీం.. అస్సలు గెస్ చేయలేరు..!

2023 లో అతితక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు టీం. అయితే మ్యాడ్‌ స్క్వేర్ టైటిల్‌తో రూపోందుతున్న ఈ సినిమాపై ఆడియ‌న్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమాల్లో సరదా సన్నివేశాలు.. మ్యాడ్‌ను మించిపోయే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

అయితే పార్ట్ వన్ లో కనిపించిన హీరోయిన్లు కాకుండా.. కొత్త హీరోయిన్లు ఈ సినిమాల్లో మెరవనున్నారట‌. శ్రీ గౌరీ, ప్రియ అనంతిక స్థానంలో మరో ముగ్గురు కొత్త హీరోయిన్లు కనిపించనున్నారు అని టాక్. ఇక మ్యాడ్ 2కి కూడా.. మ్యాడ్ సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంక‌ర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే లడ్డు గాని పెళ్లి పాట రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పటికే సినిమా షూట్ కూడా ఆల్మోస్ట్ పూర్తయిందని సమాచారం.

Priyanka Jawalkar will bring the glam factor to Mad sequel this sequel will  not have any heroines | Mad Square : హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న  "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ ...

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. 2025 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈ సినిమా కూడా పార్ట్ 1 తరహాలోనే.. కామెడీ ఎంటర్టైనర్‌గా.. కొత్త ఎలిమెంట్స్, ఫన్నీ కథతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందట. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఒక కత్తిలాంటి హాట్ బ్యూటీని టీం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. తెలుగు బ్యూటీ ప్రియాంక జువాల్కర్. టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా మెరిసిన ఈ అమ్మడు.. ఈ సినిమా ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడంతో.. తర్వాత పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా మ్యాడ్‌2 లో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. తాజాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.