టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ప్రభాస్ పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడానికి తన నటనతో పాటు.. ఆ కాటౌట్ కూడా ఓ ప్రధాన కారణం.ఈ నేపద్యంలోనే ` సాహో` మూవీ సౌత్ లో ఫెయిల్ అయినా.. నార్త్ మార్కెట్‌లో మాత్రం సంచలన వసూళ్లు రాబట్టి ప్రభాస్ రాజు స్టామినా చూపించింది. ఈ క్రమంలోనే వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్.. చివరిగా కల్కి, సలార్‌లతో బ్లాకర్ బస్టర్లు అందుకున్నాడు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రజెంట్ డార్లింగ్ భారీ లైనప్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ `స్పిరిట్`. సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెఓన్‌లో రూపొందనున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్‌గా కనిపించనున్నాడు. ఇక తన మార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా.. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్‌తో మూవీ రూపొందనుందని ఇప్పటికే హింట్ ఇచ్చేసాడు సందీప్. మరి అలాంటి పవర్‌ఫుల్ కంటెంట్‌లో ప్రభాస్‌కు తగ్గ మరో పవర్ ఫుల్ కటౌట్ ఉంటే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ హైప్ నెలకొంటుందనటంలో సందేహం లేదు.
ఈ క్రమంలోనే సంజయ్ దత్త్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో.. అందులోనూ ప్రభాస్ అన్న పాత్రలో.. ఖల్ నాయక్‌గా కనిపించనున్నాడని.. సందీప్ రెడ్డి వంగా దానికోసం అంతా సిద్దం చేసేసిన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్‌కి అన్నయ్య పాత్రలో సంజయ్ దత్త్ అయితే ప్రభాస్ వయసు..కటౌట్ ఆధారంగా.. పక్కాగా సరితూగుతాడని సందీప్ భావిస్తున్నాడట.కాగా ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికే సంజయ్ దత్ సౌత్ సినిమాల్లో పలు సినిమాలలో నటించాడు. కేజీఎఫ్, లియో, డబుల్ ఇస్మార్ట్ ఇలా తను నటించిన ప్రతి సినిమాతోను సౌత్ లో ఆయన మంచి క్రేజ్ దక్కించుకు్నాడు. దీంతో ఈ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది.