ఒక్క సినిమాకు రూ.30 కోట్లు.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ బ్యూటీ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల, నటీనటుల రెమ్యూనరేషన్ల లెక్కలు చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు సన్నిహిత వర్గాల నుంచి వచ్చే లీక్స్ లో వీరి రెమ్యునరేషన్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంతోమంది ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ బ్యూటీగా ఓ అమ్మ‌డి పేరు తగ వైరల్ గా మారుతుంది.

Priyanka Chopra - Wikipedia

ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇండియన్ ఇండస్ట్రీలో రీఎంట్రి ఇచ్చి.. తన సత్తా చాటుకున్నందుకు సిద్ధమవుతున్న ప్రియాంక చోప్రా. ఇక ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా కోసం.. ప్రియాంక అక్షరాలా రూ.30 కోట్ల రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తుంద‌ని సమాచారం. ఈ క్రమంలోనే ఇండియన్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్‌ చేసే స్టార్ హీరోయిన్గా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

Priyanka Chopra to play the antagonist in S.S. Rajamouli's 'SSMB29' against  Mahesh Babu?- REPORT

తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా హంగామా వెల్లడించింది. ఇక గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో.. సిటాడిల్ సిరీస్‌ కోసం ఐదు మిలియన్ డాలర్లు అంటే.. ఏకంగా రూ.41 కోట్లకు పైగా ప్రియంక రెమ్యున‌రేషన్ తీసుకుందట. అయితే.. ఇది ఆరు గంటల న‌డివితో రావడంతో.. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ పర్వాలేదు అనిపించుకున్నా.. ఎస్ఎస్ఎంబి29 కోసం ఆమె ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్‌ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగానే చాలా చాలా ఎక్కువ మొత్తమని.. ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఈ రేంజ్ ఛార్జ్ చేస్తున్న‌ హీరోయిన్ మరొకరు లేరంటూ టాక్ నడుస్తుంది.